అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను వణికించిన భీకర మంచు తుపాను ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలపై పంజా విసురుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 7.5 లక్షలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వివిధ కారణాల 25 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క నూయార్క్ నగరంలోనే 8 మంది మరణించినట్లు తెలిపారు.ఆర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు 2,100 కిలోమీటర్ల విస్తీరణంలో ఒక అడుగుకు మించి మంచు పేరుకుపోయింది. న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది.

