ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీలక్ష్మీనరసింహ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులు బస్సు ముందు అద్దం పగిలిపోయి ఉందని డ్రైవర్లు మస్తాన్, రసూల్‌ను ప్రయాణికులు ప్రశ్నించారు. డ్రైవర్లు నిర్లక్ష్యంతో అహంకారంగా అద్దం పగిలితేనేం? హెల్మెట్ పెట్టుకుని బస్సును నడుపుతామని నిర్లక్ష్యపు సమాధానమిచ్చాడు. ప్రయాణికులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలిసుల విచారణలో రెండు రోజుల క్రితమే ఆ బస్సుకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది. దీంతో ఆ బస్సును సీజ్ చేశారు.

