తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు అభిమానులను హత్తుకుంటోంది. ఈరోజు (జనవరి 29) అంజనా దేవి పుట్టినరోజు కావడంతో, చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “అమ్మా.. నీ ఆశీర్వాదమే నా బలం. పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ ఎమోషనల్ మెసేజ్‌ను పంచుకున్నారు. ఈ సందేశంతో పాటు ఒక ప్రత్యేక వీడియోను కూడా అభిమానులతో షేర్ చేశారు.

