సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత తీవ్రంగా స్పందించిన ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. ఈ క్రమంలోనే అమెరికా విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా ఇదే విషయం గురించి తెలిపింది. అబ్రహం లింకన్ విమాన వాహక నౌక వైపు నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని పేర్కొంది. ఈ విషయంలో అమెరికా వైపు నుండి అధికారిక ధ్రువీకరణ లేదు.

