దేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100 శాతం ఇథనాల్‌తో నడిచే E100 వాహనాలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మోటార్ వెహికల్స్ రూల్స్‌లో మార్పులు చేసింది. అయితే E100 ఇంధనాన్ని అన్ని వాహనాల్లోనూ ఉపయోగించడానికి అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. వాహనాలు E85 లేదా E100 ఇంధనానికి అనుకూలంగా తయారై ఉంటేనే వాటిని వినియోగించాలని సూచించింది. సాధారణంగా E20 ఇంధనం కోసం రూపొందించిన వాహనాల్లో E100 ఇంధనాన్ని ఉపయోగించడం సరైనది కాదని పేర్కొంది.