loader

భారతీయుడిపై ట్రంప్ నోటి దురుసు

న్యూయార్క్ మేయర్ పదవి కోసం పోటీపడుతున్న వారిలోభారత సంతతికి చెందిన వామపక్ష సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ ఉన్నారు. దీంతో ట్రంప్ ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జోహ్రాన్ మమ్దానీ పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ “భయంకరంగా కనిపిస్తున్నాడు, అతని గొంతు గజిబిజిగా ఉంది, అతను అంత తెలివైనవాడు కాదు, డమ్మీస్ అందరూ అతనికి మద్దతు ఇస్తున్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక గొప్ప క్షణం!” అని సెటైరిక్‌గా వ్యాఖ్యలుచేస్తున్నారు.

ఇజ్రాయెల్‌పై మేమే గెలిచాం: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ‘విజయం’ సాధించిందని, అమెరికాను కూడా చావుదెబ్బ తీశామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ను నేరుగా ప్రస్తావించకుండా, “మోసపూరిత జియోనిస్ట్ పాలన” అంటూ సంబోధించారు. ఈ మేరకు ఆయన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించారు.

సోషల్ మీడియా ఖాతాలు ప్రైవేట్‌లో పెడితే వీసాలు ఇవ్వం

అమెరికా వీసా దరఖాస్తుదారులకు అమెరికా దౌత్య కార్యాలయం ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. DS-160 ఫారంలో గత ఐదేళ్ల సోషల్ మీడియా వివరాలు పూర్తిగా వెల్లడించకపోతే వీసా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పింది. అంతేకాకుండా భవిష్యత్తులో అమెరికా వీసాలకు కూడా అనర్హులు కావచ్చని వివరించింది. విద్యార్థి, ఉద్యోగ వీసాదారులు తమ ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాలని సూచించింది.

గాజాలో సాయుధ వాహనం పేలి ఏడుగురు ఇజ్రాయెల్ సైనికుల మృతి

దక్షిణ గాజా నగరం ఖాన్‌యూనిస్‌లో సైనికుల సాయుధ వాహనాన్ని పేల్చివేయడంతో ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. వాహనానికి అమర్చిన పేలుడు పరికరాన్ని మంగళవారం పేల్చివేయడంతో ఈ సంఘటన జరిగిందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి బుధవారం తెలిపారు. గాజాలో ఈ సంఘటన ఇజ్రాయెల్ మిలిటరీకి ప్రాణాంతకమైనది. హమాస్‌తో యుద్ధం 2023 అక్టోబర్7న ప్రారంభమైన నాటి నుంచి 860 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందగా, వీరిలో 400 మంది గాజాలోనే మృతి చెందారు.

వీడియో గేమ్‌లో రాజమౌళి..

రాజమౌళి ఓ వీడియో గేమ్‌లో ప్రత్యక్షమయ్యారు. వీడియో గేమ్‌లు ఇష్టపడే అందరికీ హిడియో కోజిమా సుపరిచితమే. ఆయన రూపొందించిన సూపర్‌ సక్సెస్‌ గేమ్‌ డెత్‌ స్ట్రాండింగ్‌ సెకండ్ వెర్షన్‌లో రాజమౌళి, కార్తికేయ కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డెత్‌ స్ట్రాండింగ్‌ 2లో హాలీవుడ్‌ నటులు నార్మన్‌ రీడస్‌, ఎల్లీ ఫానింగ్‌లు భాగం కాగా.. వారితో పాటు రాజమౌళి, కార్తికేయ కూడా కనిపించనున్నారు. ఈ గేమ్ జూన్ 26 నుంచి పూర్తిగా అందుబాటులోకి […]

శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, మరో 3 మంది ప్రయాణికులతో కూడిన ఆక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రయాణానికి బయలుదేరింది.ఈ మిషన్ సరిగ్గా మధ్యాహ్నం 12.01 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. SpaceX కొత్త డ్రాగన్ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని NASA కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి బయల్దేరింది. ఈ అంతరిక్ష నౌకను కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు.

ఫ్రాన్స్‌ను పిచ్చెక్కిస్తున్న సిరంజి దాడులు..

సాధారణ జనాలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సిరంజీలతో దాడికి పాల్పడుతున్న ఘటనలు ఫ్రాన్స్‌ దేశంలో వెలుగుచూశాయి. ‘ఫెటెస్ డి లా మ్యూజిక్ ఫెస్టివల్’ లో పాల్గొన్న ప్రేక్షకులపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ‘సిరంజులతో దాడులకు పాల్పడ్డారు. నిందితుల చేతుల్లో సూది పోట్లకు గురైన కొంత మంది అనారోగ్యబారిన పడ్డారు. గుండెలు, చేతులు, కాళ్లు, పిరుదులపై సిరంజితో గుచ్చినట్లు బాధితులు తెలిపారు. వాటి కారణంగా తమలో తలతిరగడం, వాంతులు, అసౌకర్యం వంటి లక్షణాలను కనిపించాయని తెలిపారు.

ఇరాన్‌పై దాడి వీడియోలు రిలీజ్ చేసిన పెంటగాన్

ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ పేరుతో అమెరికా సైన్యం ఇరాన్‌లోని మూడు కీలక న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్ , నటాంజ్ , ఇస్ఫహాన్ B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌లు బాంబుల వర్షం కురిపించాయి. పెంటగాన్ జూన్ 24, 2025న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అధికారిక వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది, ఇందులో B-2 బాంబర్‌లు వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి బయలుదేరడం, దాడి అనంతరం తిరిగి వచ్చే దృశ్యాలు ఉన్నాయి.

శత్రువుల మాటలపై మాకు నమ్మకం లేదు..టెహ్రాన్‌

12 రోజులుగా ఆయుధాలతో యుద్ధం చేసుకున్న ఇజ్రాయెల్-ఇరాన్‌..ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణను ఇరాన్‌ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. తమపై క్షిపణులతో దాడులకు దిగిందని టెల్‌అవీవ్‌ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్‌పై తాము ఎలాంటి దాడులూ చేయలేదని ఇరాన్‌ సైనికాధికారులు వెల్లడించారు. శత్రువుల మాటలపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తమ చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని వెల్లడించారు.

కాల్పుల విరమణ చేయాలంటూ ట్రంప్ బతిమాలారు..ఇరాన్

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గత కొంత కాలంగా యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తూ.. అమెరికా కూడా ఆదివారం రోజు ఇరాన్‌పై దాడి చేసింది. దీంతో ఇరాన్ సైతం అమెరికా స్థావరాలపై ప్రతి దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఖతార్‌లోని అనేక స్థావరాలపై విజయవంతంగా దాడి చేసింది. ఈక్రమంలోనే ఇజ్రాయెల్‌తో ట్రంప్ బలవంతంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరింపజేశారని ఇరాన్ వివరిస్తోంది. ఈ దాడి అనంతరమే ఒప్పందం కోసం ట్రంప్ తమను ప్రాధేయ పడ్డారని పేర్కొంటోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON