సాధారణ జనాలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సిరంజీలతో దాడికి పాల్పడుతున్న ఘటనలు ఫ్రాన్స్ దేశంలో వెలుగుచూశాయి. ‘ఫెటెస్ డి లా మ్యూజిక్ ఫెస్టివల్’ లో పాల్గొన్న ప్రేక్షకులపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ‘సిరంజులతో దాడులకు పాల్పడ్డారు. నిందితుల చేతుల్లో సూది పోట్లకు గురైన కొంత మంది అనారోగ్యబారిన పడ్డారు. గుండెలు, చేతులు, కాళ్లు, పిరుదులపై సిరంజితో గుచ్చినట్లు బాధితులు తెలిపారు. వాటి కారణంగా తమలో తలతిరగడం, వాంతులు, అసౌకర్యం వంటి లక్షణాలను కనిపించాయని తెలిపారు.

