హాస్యాస్పదం.. ఎలాన్ మస్క్ పార్టీపై ట్రంప్ వ్యాఖ్యలు
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) రాజకీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. తమ దేశంలో ఎల్లప్పుడూ రెండు పార్టీల వ్యవస్థ ఉంటుందని, మూడో పార్టీని ప్రారంభించడం గందరగోళానికి తావిస్తుందని విమర్శించారు. అది దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశం ఉందన్నారు. అలాంటి వ్యవస్థను అమెరికన్లు అంగీకరించని చరిత్ర చెబుతుందన్నారు. మస్క్ పూర్తిగా నియంత్రణ కోల్పోయారని, ఆయనను చూస్తే జాలేస్తుందన్నారు.

