ఎట్టకేలకు మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పాస్ అయితే మూడో పొలిటికల్ పార్టీ పెడతానని చెప్పారు మస్క్. ఈ నేపథ్యంలో రెండోసారి పోల్ ఎక్స్ వేధికగా నిర్వహించారు. ఆయన ప్రధాన ఎజెండా రెండు పార్టీలు అమెరికాలో ఒకటే. మీరు కొత్త పార్టీని కోరుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి అందించేందుకు ఇవాళ ‘ది అమెరికా పార్టీ’ రూపుదిద్దుకుంటుంది అంటూ మస్క్ ట్విట్ చేశాడు.

