జపాన్‌లోని షిన్మోడాకే అగ్నిపర్వతం జూలై 3న బద్దలయ్యింది. అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ, బూడిద ఎగసిపడుతున్నాయి. 3,000 మీటర్ల ఎత్తు వరకూ పొగ వ్యాపించడంతో స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. రోయో టాట్సూకీ రూపొందించిన మాంగా కార్టూన్‌లో పేర్కొన్న జోస్యం నిజం కాబోతోందని టెన్షన్ పడిపోతున్నారు. 021లో రెండో ఎడిషన్ మాంగా కార్టూన్‌లను విడుదల చేసిన ఆమె 2025 జులైలో మరో ప్రకృతి విపత్తు గురించి హెచ్చరించారు. సునామీ ముంచెత్తుతుందని హెచ్చరించారు.

