loader

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ భయంలో ప్రజలు!

ఆగ్నేయ ఇండోనేషియాలోని తనింబర్ దీవుల్లో సోమవారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. ఇండోనేషియా “రింగ్ ఆఫ్ ఫైర్” లో ఉండటంతో భూకంపాలు సర్వసాధారణం. ఈ ప్రాంతం భూకంపలకు ప్రసిద్ధి చెందింది. ఈ భూకంపం కారణంగా కనీసం 15 ఇళ్లు రెండు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

షేక్ హసీనా కుమార్తెకు WHO షాక్.. అవినీతి ఆరోపణలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమార్తె, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజెద్ పుతుల్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సదరు సంస్థ నిరవధిక సెలవుపై పంపింది. మోసం, ఫోర్జరీ వంటి ఆరోపణలపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ కేసు నమోదు చేసిన నాలుగు నెలల తర్వాత..WHO ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆమె స్థానంలో కేథరీనా బోహ్మే తాత్కాలిక బాధ్యతలు స్వీకరించనున్నారు.

టేకాఫ్‌ అయిన వెంటనే కూలిన విమానం.. షాకింగ్‌ దృశ్యాలు

లండన్‌ లో ఘోర ప్రమాదం సంభవించింది. సౌత్‌ఎండ్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఓ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో కుప్పకూలిపోయింది నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఏవియేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న చిన్న విమానం ఆదివారం మధ్యాహ్నం సౌత్‌ ఎండ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గాల్లోకి ఎగిరింది. టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం ఒక్కసారిగా కూలిపోయింది. పెద్దశబ్దంతో మంటలు వ్యాపించాయి. అనంతరం నల్లటి పొగ ఎగసిపడింది.

నేడు భూమికి భయలుదేరనున్న వ్యోమగాములు

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సోమవారం (జులై 14న) 18 రోజుల ఆక్సియం4 స్పేస్ మిషన్ యాత్ర ముగించుకొని ఆయన తిరిగి భూమి మీదకు రాబోతున్నారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్ నుంచి తన చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్‌ను గమనిస్తే ఉన్నత ఆశయంతో కూడిన నమ్మకమైన, నిర్భయమైన, గర్వంతో ఉప్పొంగుతున్న దేశంగా కనిపిస్తోంది అన్నారు. ఈ రోజుకూ మన దేశం ‘సారే జహాసే అచ్ఛా’ అంటూ శుభాన్షు శుక్లా […]

యూకే ఇమ్మిగ్రేషన్‌లో కీలక మార్పులు..

ఉన్నత విద్య కోసం వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం కొత్త ఈ-వీసా విధానాన్ని 2025 జూలై 15 నుంచి ఇది అధికారికంగా ప్రవేశపెడుతోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న భౌతిక వీసా స్టిక్కర్ల స్థానంలో సురక్షితమైన డిజిటల్ రికార్డులను వాడుకలోకి తీసుకు రాబోతున్నారు. ఈ కొత్త విధానం కింద విద్యార్థులకు ఇకపై పాస్‌పోర్ట్‌పై భౌతిక వీసా ముద్ర (విగ్నేట్) ఉండదు. బదులుగా వారి ఇమ్మిగ్రేషన్ స్థితికి సంబంధించిన సమాచారం పాస్‌పోర్ట్‌కు లింక్ చేయబడిన సురక్షితమైన […]

సుంకాల మోతకు సిద్ధమైపోయిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోతకు సిద్ధమైపోయారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాలపై సుంకాల విధింపునకు ట్రంప్ రెడీ అయ్యారు. ఆయా దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వచ్చే నెల (ఆగస్ట్) ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

జులై 15న భూమికి చేరుకోనున్న శుభాన్షు శుక్లా

యాక్సియం-4 మిషన్‌ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములు జులై 14న తిరుగు ప్రయాణం చేపడుతున్నట్లు నాసా గురువారం ప్రకటించింది. జులై 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడా తీరంలో ల్యాండ్‌ కానున్నారు. అయితే, వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు తరలించనున్నట్లు ఇస్రో తాజాగా తెలిపింది.

భారతీయుల కోసం భారీ ఆఫర్‌ ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌..!

భారతీయుల కోసం ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఎక్స్‌ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ భారతదేశంలోని తన వినియోగదారులకు సబ్‌స్క్రిప్షన్ ఫీజులను గణనీయంగా తగ్గించిందని నివేదికలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 48 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. మొబైల్ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రూ.900 నుండి రూ.470కి వెబ్ ఖాతాలకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రూ.650 నుండి రూ.427కి తగ్గించింది

ఇంట‌ర్నెట్ స్పీడ్‌లో జ‌పాన్ సంచ‌ల‌నం

జ‌పాన్‌లో ఇప్పుడు ఇంట‌ర్నెట్ రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ ఇంట‌ర్నెట్‌ను ఆ దేశం రూపొందించింది. ఒక సెక‌నుకు 1.02 పెటాబిట్స్ వేగంతో (At petabit speeds)ప‌నిచేసే ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని క‌నుగొన్నారు.జ‌పాన్‌లో ఆ వేగంతో కేవ‌లం సెక‌నులోనే నెట్‌ఫ్లిక్స్ లైబ్ర‌రీలో ఉన్న వీడియోల‌ను డౌన్‌లోడ్ చేయ‌వచ్చు అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. భార‌త్‌తో పోలిస్తే జ‌పాన్‌లో బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్ స్పీడ్ 16 మిలియ‌న్ల సార్లు ఎక్కువ అని తెలిసింది.

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు

జర్మనీకి చెందిన ‘ది ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ’ అనే స్టార్టప్, అమెరికాకు చెందిన ‘సెలెస్టిస్’ అనే స్పేస్ బరియల్ సంస్థతో కలిసి ఈ వినూత్న ‘మిషన్ పాజిబుల్’ను చేపట్టింది. క్యాప్సూల్‌లో 166 మంది అస్థికలతో పాటు, ఔషధ ప్రయోగాల నిమిత్తం కొన్ని గంజాయి విత్తనాలు, ఇతర పరిశోధనా పరికరాలను కూడా ఉంచారు. సముద్రంలో సురక్షితంగా దిగడానికి కొన్ని నిమిషాల ముందు దానితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అనంతరం, అది పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON