loader

పాక్‌కు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న భారత్..! చీనాబ్‌ నదిపై జల విద్యుత్‌ ప్రాజెక్టు

పాక్‌కు భారత్‌ గట్టి షాక్‌ ఇవ్వబోతున్నది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును తిరిగి చేపట్టబోతున్నది. దాంతో పాకిస్తాన్‌కు భారత్ అడ్డుకట్ట వేయనుంది. ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టు పునరుద్ధరణకు సిద్ధమవుతున్నది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇటీవల అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది.

ఆస్ట్రేలియా స్పేస్ ప్రాజెక్ట్ తొలి ప్రయత్నం విఫలం

ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన రంగంలో మైలురాయిగా భావించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన ‘ఎరిస్’ రాకెట్ తన మొదటి పరీక్షా ప్రయోగంలో కేవలం 14 సెకన్లలోనే విఫలమవడం దేశానికి పెద్ద షాక్‌గా మారింది. ఈ ఘటన క్వీన్స్‌ల్యాండ్‌లోని బోవెన్ ఆర్బిటల్ స్పేస్‌పోర్ట్‌లో చోటుచేసుకోగా, రాకెట్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు ఆకాశాన్నంటాయి.

ఆకస్మిక వరదలకు కొట్టుకుపోయిన రూ.కోట్లు విలువ చేసే బంగారం.. వెతికేందుకు ఎగబడ్డ జనం

చైనా షాంగ్జీ ప్రావిన్స్‌లో ఈనెల 25న భారీ వర్షాలు కురిశాయి ఆ ప్రాంతంలో ఓ బంగారు ఆభరణాల దుకాణాన్ని వరద ఒక్కసారిగా పోటెత్తింది. కొట్టుకుపోయిన వాటిలో హారాలు, ఉంగరాలు, గాజులు, చెవి కమ్మలు, వజ్రాల ఉంగరాలు, కొన్ని వెండి వస్తువులు దాదాపు 20 కేజీల బంగారం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి విలువ రూ.12 కోట్లకు పైమాటే అని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కొట్టుకుపోయిన బంగారం వెతికేందుకు ఎగబడ్డారు. వీధుల్లో బురద నీటిలో […]

భారత్‌పై అక్కసు.. 25శాతం టారీఫ్‌, పెనాల్టీ విధించిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు, జరిమానా భారం తప్పదని హెచ్చరించిన ట్రంప్.. భారత్‌పై 25శాతం టారిఫ్‌ ప్రకటించారు. తాము వారించినా వినకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై టారీఫ్‌తో పాటు అదనపు పెనాల్టీ కూడా విధించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్ దిగుమతి చేసుకొనే వస్తువులపై కొత్త టారీఫ్‌, పెనాల్టీ నిబంధనలు వర్తిస్తాయని ట్రంప్ వెల్లడించారు.

అత్యంత శ‌క్తివంత‌మైన భూకంపం.. చ‌రిత్ర‌లో ఆరోసారి రికార్డు

ర‌ష్యాలోని కామ్‌చ‌ట్కా ద్వీపంలో ఇవాళ అత్యంత శ‌క్తివంత‌మైన భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్ర‌త 8.8గా న‌మోదు అయ్యింది. అయితే భూగ‌ర్భ శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌కారం.. భూకంపాల చ‌రిత్ర‌లో ఇది ఆర‌వ అత్యంత శ‌క్తివంత‌మైన భూకంపంగా రికార్డు అయ్యింది. భూగోళాన్ని కుదిపేసిన అతి తీవ్ర‌మైన ప‌ది భూకంపాల్లో తాజా భూకంపం నిలుస్తుంద‌ని హ‌వాయి వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ హెలిన్ జానిస్‌జెవిస్కీ తెలిపారు. ఇదే స్థాయిలో గ‌తంలో 2010లో చిలీ దేశంలో, 1906లో ఈక్వెడార్‌లో భూకంపం న‌మోదు అయిన‌ట్లు […]

అమెరికాలో కలకలం.. కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి భారత సంతతి పైలట్‌ అరెస్ట్

చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో భారత సంతతికి చెందిన పైలట్‌ను అరెస్ట్ చేశారు. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కో-పైలట్ రుస్తమ్ భగ్వాగర్ (34)ను చిన్నారిపై లైంగిక దాడి కేసులో అరెస్ట్ చేశారు. విమానం ల్యాండ్ అయిన 10 నిమిషాల్లోనే 10 మంది హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు విమానంలోకి ప్రవేశించారు. తుపాకులు, బ్యాడ్జీలు ధరించి కాక్‌పిట్‌లోకి ప్రవేశించి రుస్తమ్‌కు హ్యాండ్‌ కఫ్ వేసి బయటకు తీసుకెళ్లారు. ప్రయాణికులు ఇంకా దిగకముందే ఘటన చోటుచేసుకుంది.

కేరళ నర్స్‌ ఉరిశిక్ష రద్దు‌…ఉరిశక్ష రద్దును ధృవీకరించని ప్రభుత్వవర్గాలు

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ ఇది. హత్య కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్‌ ప్రభుత్వం అంగీకరించిందని వార్తలు వచ్చాయి. అయితే ఉరిశక్ష రద్దును ప్రభుత్వవర్గాలు ధృవీకరించలేదు. ఈ వార్తలు సరికావంటుని విదేశాంగ శాఖ అధికారులు అంటున్నారు. నిమిష ప్రియ మరణశిక్షను రద్దయినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం అబూబకర్ ముస్లియార్ ఆఫీస్‌ సోమవారం ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి.

థాయ్‌లాండ్ – కంబోడియాల మధ్య కాల్పుల విరమణ…

థాయ్‌లాండ్, కంబోడియా దేశాల మధ్య కొనసాగుతన్న ఘర్షణకు తెరపడింది.కంబోడియా, థాయ్‌లాండ్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అంతేకాకుండా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొన్న ఇరుదేశాల నాయకులు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వివాదాస్పద 800 కి.మీ సరిహద్దులో ఇరువైపులా 35 మంది మరణించగా, 2,60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు థాయ్‌లాండ్, కంబోడియాలు వాటి మధ్య ఘర్షణను ఆపడానికి అంగీకరించకపోతే… ఇరుదేశాలతో అమెరికా వాణిజ్య చర్చలు నిలిపివేయబడతాయని […]

మహిళా గ్రాండ్ మాస్టర్‌‌గా దివ్య దేశ్‌ముఖ్..

జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ టైబ్రేకర్లలో తన స్వదేశీయురాలు కోనేరు హంపీని ఓడించి గెలుచుకుంది. మొదటి గేమ్‌ను డ్రా చేసుకున్న 19 ఏళ్ల దివ్య రెండవ రాపిడ్ గేమ్‌లో విజయం సాధించింది. బ్లాక్ పావులతో ఆడుతున్న హంపి.. ఓ తప్పిదం చేయడంతో.. దివ్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని  తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని సాధించి, భారత్ తరపున 4వ మహిళా గ్రాండ్ […]

అమెరికా వీసా ఇంటర్వ్యూ మినహాయింపుల్లో మార్పులు..

ఇకపై నాన్‌ఇమిగ్రెంట్‌ వీసా కోసం అప్లై చేసుకునే చాలా మంది ఇప్పుడు అమెరికా రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌లో పర్సనల్‌ ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటుంది. 14 ఏళ్లలోపు పిల్లలు, 79 ఏళ్లు పైబడిన పెద్దలు కూడా అటెంట్‌ చేయాల్సిందే. గతంలో చాలా మంది ‘డ్రాప్‌బాక్స్’ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్వ్యూలను స్కిప్‌ చేసే ఛాన్స్‌ ఉండేది. మెయిల్ ద్వారా డాక్యుమెంట్స్‌ సబ్మిట్‌ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ ఆప్షన్‌ కొన్ని స్పెసిఫిక్‌ కేసులకు మాత్రమే వర్తిస్తుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON