జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ టైబ్రేకర్లలో తన స్వదేశీయురాలు కోనేరు హంపీని ఓడించి గెలుచుకుంది. మొదటి గేమ్‌ను డ్రా చేసుకున్న 19 ఏళ్ల దివ్య రెండవ రాపిడ్ గేమ్‌లో విజయం సాధించింది. బ్లాక్ పావులతో ఆడుతున్న హంపి.. ఓ తప్పిదం చేయడంతో.. దివ్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన కెరీర్లో అతిపెద్ద విజయాన్ని సాధించి, భారత్ తరపున 4వ మహిళా గ్రాండ్ మాస్టర్‌గా అవతరించింది.

