loader

అన్నంత పని చేసిన ట్రంప్..మరో 25% ట్యాక్స్

భారతదేశంపై అమెరికా మరో ఆర్థిక ఎదురుదెబ్బ వేసింది. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికే ఉన్న 25% సుంకానికి తోడు, తాజాగా అదనంగా మరో 25% సుంకాన్ని విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ద్వారా భారత్‌పై మొత్తంగా 50% దిగుమతి సుంకం అమలులోకి రానుంది. భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని, అదే కారణంగా, భారత్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ […]

చైనాలో మరో వైరస్ కలకలం..

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో చికున్‌గున్యా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ దోమల ద్వారా సంక్రమించే వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో “ఏనుగు దోమలు” (elephant mosquitoes) అని పిలిచే ఒక రకం దోమలను కూడా విడుదల చేశారు. ఈ ఏనుగు దోమలు మనుషులను కుట్టవు. కానీ అవి వ్యాధిని వ్యాప్తి చేసే ఇతర దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి.

ట్రంప్‌నకు బ్రెజిల్ అధ్యక్షుడి ఘాటు సమాధానం

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్‌పై సుంకాలు విధిస్తానని హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా మీరు నాక్ ఫోన్ చేయొచ్చంటూ ఆ దేశ అధ్యక్షుడికి ఆఫర్ కూడా ఇచ్చారు. ట్రంప్ తనతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని, అందుకే నేను ఆయనకు ఫోన్ చేయనని లులా స్పష్టం చేశారు. బ్రిక్స్ భాగస్వాములైన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లకు ఫోన్ చేసి.. వాణిజ్య సంబంధాలను బలోపేతం […]

సచిన్ కూతురంటే మినిమం ఉంటది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో పర్యాటకాన్ని పెంచడానికి త్వరలో ఒక భారీ క్యాంపెయినింగ్ ప్రారంభించబోతోంది. ఈ ప్రచారంలో భాగంగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ‘కమ్ అండ్ సే G’డే’ ఆస్ట్రేలియా టూరిజాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలలో జరగనుంది. క్యాంపెయిన్ కోసం సుమారు రూ.1137 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రతి దేశం నుంచి ఒక ప్రముఖ వ్యక్తిని ఈ క్యాంపెయిన్‌లో […]

ఘోర పడవ ప్రమాదం.. 68 మంది పైగా మృతి..

ఎడారి దేశమైన యెమన్ లో పడవ బోల్తా పడటంతో 68 మంది మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో సముద్రంలో అల్లకల్లోకం ఏర్పడింది. అలలకు యెమన్ సముద్ర జలాల్లో ఉన్న బోటు ఒక్కసారి తిరగబడింది దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంత సముద్రంలో పడిపోయారు. పడవలో మొత్తంగా 154 మంది ఆఫ్రియా దేశమైన ఇథియోపికకు చెందిన ప్రజలు ప్రయాణిస్తున్నట్టు సమాచారం మరోవైపు 74 మంది జాడా తెలియరాలేదు.

ఇజ్రాయెల్ భీకర దాడులు.. గాజాలో 27మంది బలి

ఇజ్రాయెల్ సేనలు ఆదివారం మరోసారి గాజాలోని రెండు అన్నార్థుల సహాయక కేంద్రాల వద్ద దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది వరకూ మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. తిండి, మందులు మంచినీటి కోసం ఇక్కడికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చిన దశలోనే కాల్పులు జరిగినట్లు వెల్లడైంది. జిహెచ్‌ఎఫ్ కేంద్రాలకు అమెరికా నుంచి కూడా భారీ స్థాయిలో నిధులు అందుతున్నాయి.

హసీనా లేకుండానే.. అమానుషకాండపై విచారణ షురూ

ఆమె హాజరీతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లో విచారణ ఆరంభించారు. హసీనా ఇతరులపై అమానుషకాండ కేసు దాఖలు అయింది. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసిటి) ఈ ప్రక్రియను హసీనా హాజరీతో నిమిత్తం లేకుండా చేపట్టింది. ఆమె తమ పదవీకాలంలో విద్యార్థుల నిరసనలపై దమననీతితో వ్యవహరించారని, అమానుష నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు వెలువడ్డాయి. ఆమెకు పలుసార్లు సమన్లు ఆమె పేరిట పంపించారు.

టెస్లా కంపెనీకి ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా

ఎలాన్ మస్క్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధించింది.2019లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్పట్లో టెస్లాపై కేసు నమోదైంది. టెస్ల్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థలో లోపం వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు తాజాగా ఫ్లోరిడా కోర్టు తేల్చింది. బాధిత కుటుంబానికి 240 మిలియన్ డాలర్ల( భారత కరెన్సీలో సుమారుగా రూ.1996 కోట్లు)పరిహారం చెల్లించాలని టెస్లాను ఆదేశించింది.

స్ట్రీట్‌ వ్యూలో ప్రైవేట్‌ ఫొటో..! గూగుల్‌కు భారీగా జరిమానా విధించిన కోర్టు

అర్జెంటీనాలో ఓ పోలీస్‌ అధికారి   ఇంటి నుంచి గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ కారు వెళ్లింది. అధికారి తన ప్రైవేట్‌ స్థలంలో ఉన్నాడు. స్థలానికి ఎత్తయిన గోడ సైతం ఉంది. ఆ స్థలంలో ఆయన నగ్నంగా ఉన్న సమయంలో గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ కారు వెళ్లడంతో అందులో రికార్డయ్యింది. అప్పీలేట్‌ కోర్టును ఆశ్రయించగా గోప్యతా హక్కును గూగుల్‌ ఉల్లంఘించదని పేర్కొంటూ కోర్టు గూగుల్‌కు 12,500 (భారతీయ కరెన్సీలో రూ.10.8లక్షలు) డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

భారత్‌ కొంటున్న చమురుతోనే పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు

రష్యాతో భారత్‌ చమురు బంధమే.. న్యూఢిల్లీతో చర్చల్లో తమకు చికాకు తెప్పించే అంశమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో అన్నారు. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్‌కు చమురు చౌకగా లభిస్తోంది. దీంతో న్యూఢిల్లీ తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్‌ చమురు కొనుగోలు వల్లే రష్యాకు నిధులు సమకూరుతున్నాయి. ‘రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లే ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON