కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాష్ట్రంలో ఆపరేషన్ కుంకీ మొదలైందని… కుంకీ ఏనుగులు ద్వారా చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కార్యాలయం ఒక ప్రటకన విడుదల చేసింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టినట్టు అటవీ శాఖ అధికారులు చెప్పారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు

