ఇటీవల మహారాష్ట్ర రాజధాని ముంబైలో బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు అవయవాలు ఇలా రంగు మారవు. కానీ, మరణించిన నలుగురి మెదడు, గుండె మరియు జీర్ణావయవాలు ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. ఇది ఏదైనా శక్తివంతమైన విష ప్రయోగం వల్లనే జరిగి ఉండవచ్చని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్ధారించారు. శరీరమంతా విషం వేగంగా వ్యాపించడం వల్లే అవయవాల రంగు మారిందని నిపుణులు భావిస్తున్నారు.

