అర్జెంటీనాలో ఓ పోలీస్ అధికారి ఇంటి నుంచి గూగుల్ స్ట్రీట్ వ్యూ కారు వెళ్లింది. అధికారి తన ప్రైవేట్ స్థలంలో ఉన్నాడు. స్థలానికి ఎత్తయిన గోడ సైతం ఉంది. ఆ స్థలంలో ఆయన నగ్నంగా ఉన్న సమయంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ కారు వెళ్లడంతో అందులో రికార్డయ్యింది. అప్పీలేట్ కోర్టును ఆశ్రయించగా గోప్యతా హక్కును గూగుల్ ఉల్లంఘించదని పేర్కొంటూ కోర్టు గూగుల్‌కు 12,500 (భారతీయ కరెన్సీలో రూ.10.8లక్షలు) డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

