loader

జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. గాయత్రీ మంత్రం, భజనలతో ఆహ్వానం

ప్రధాని మోదీకి జపాన్‌లో ఘన స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయంలో జపాన్ మహిళలు.. ఆయనకు ఆహ్వానం పలికారు. గాయత్రీ మంత్రంతో పాటు భజనలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ మహిళలను ప్రధాని మోదీ అభినందించారు. ఇక తన జపాన్ పర్యటన.. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

‘చమురు కొంటూ పిల్లల ఉసురు తీస్తున్నారు’.. భారత్, చైనాపై అమెరికా సెనేటర్ సంచలన ఆరోపణలు

అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులో.. “చౌకగా రష్యన్ చమురును కొనుగోలు చేస్తూ.. పుతిన్ యుద్ధాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న భారతదేశం, చైనా, బ్రెజిల్ సహా ఇతర దేశాలకు హెచ్చరిక. మీ కొనుగోళ్ల ఫలితంగా పిల్లలు సహా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇప్పుడు ఎలా ఫీలవుతున్నారు. పుతిన్‌కు మద్దతు ఇచ్చినందుకు గాను భారత్ మూల్యం చెల్లిస్తోంది. మిగతా దేశాలు కూడా త్వరలోనే చెల్లిస్తాయి” అన్నారు.

‘ఇస్లాంను అంతం చేస్తా’.. ఖురాన్‌ను కాల్చేస్తూ.. అమెరికా నేత వివాదాస్పద వ్యాఖ్యలు

టెక్సాస్‌లో ఇస్లాం మతాన్ని లేకుండా చేస్తానంటూ.. ఖురాన్‌ను తగులబెట్టి అమెరికా రాజకీయ నాయకురాలు వాలెంటినా గోమెజ్ సంచలనం సృష్టించారు. ముస్లింలు క్రైస్తవుల కుమార్తెలపై అత్యాచారం చేస్తారని, వారి కుమారులను చంపుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒక క్రైస్తవ దేశమని.. అక్కడ ఉన్న ముస్లింలు ఇతర దేశాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పుడే కాదు ఆమె గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలకు పాల్పడ్డారు.

మోదీ వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: అమెరికా

రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ అనేది మోదీ యుద్ధమే’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. రష్యా ముడి చమురును భారత్ కొంటున్నందు వల్లే మాస్కో నేటికీ ఉక్రెయిన్ తో యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని ఆయన అన్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రజలపైనా భారం పెరిగిందన్నారు పీటర్. రష్యా-ఉక్రెయిన్ శాంతిమార్గంలో కనీసం కొంతభాగం న్యూఢిల్లీ మీదుగా వెళ్తుందని పీటర్నవారో పేర్కొన్నారు.

మళ్ళి కీవ్‌పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా..

ఉక్రెయిన్‌ పై రష్యా భీకర దాడికి పాల్పడింది. రాజధాని కీవ్‌ పై డ్రోన్ల తో విరుచుకుపడింది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 48 మంది గాయపడ్డారు. మాస్కో దాదాపు 598 డ్రోన్లు, 31 క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు.

ఎలన్ మస్క్‌ది ఎంత పెద్ద మనసు, గ్రోక్ ఇమాజిన్ ఫ్రీగా వాడుకోవచ్చు

X, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత అయతే ఎలాన్ మస్క్ కమర్షియల్ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్నారు. అయితే తన కొత్త AI సాధనం గ్రోక్ ఇమాజిన్‌ను మాత్రం ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఇది కావాలంటే కొంత డబ్బులను చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూజర్లకు ఇది ఫ్రీ. గ్రోక్ ఇమాజిన్ సాధనం అనేక AI మోడళ్లను కలిగి ఉంది. దీన్ని సాయంతో చిత్రాలను సృష్టించవచ్చు. అలాగే 6 సెకన్ల వీడియోలను సంగీతంతో సృష్టించవచ్చు. ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. ఫిల్టర్లు, […]

భారత ఉత్పత్తులపై 50% అదనపు సుంకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై విధించిన 50% అదనపు సుంకాలు భారత కాలమానం ప్రకారం August 27, 2025 ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ టారిఫ్‌లు భారత్ యొక్క వస్త్ర, ఆక్వా (మెరైన్ ఉత్పత్తులు), తోలు, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, ఆటో భాగాలు వంటి రంగాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అయితే, ఔషధాలు, సెమీకండక్టర్లు, శక్తి వనరులు (క్రూడ్ ఆయిల్, సహజ వాయువు), కీలక ఖనిజాలపై మినహాయింపు ఉంది.

గాజాలోని నాజర్‌ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ దాడులు..

హమాస్‌ అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. గాజా నగరంలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్‌ దాడులకు తెగబడింది. నాజర్‌ ఆస్పత్రిపై సోమవారం జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నిలిస్టులు సహా కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో ఒకరు రాయిటర్స్‌కు చెందిన హతేమ్‌ ఖలీద్‌, ఓ ఫొటోగ్రాఫర్‌ అని స్థానిక వార్తా సంస్థ తెలిపింది.

అమెరికా ఎన్ని చేసినా మేం తలొగ్గం- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

ఖమేనీ మరోసారి అమెరికాపై మండిపడ్డారు. తమను లొంగదీసుకోవడానికి వాషింగ్టన్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కానీ దానిని ఎదుర్కొనేందుకు కలిసి కటుటగా పోరాడదామని తెలిపారు. అదే సమయంలో భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఓ ప్రకటన ఆయన వెబ్సైట్లో జారీ చేశారు. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ప్రభుత్వం సహా ఇరాన్ మొత్తం తమ సైన్యానికి అండగా నిలబడిందన్నారు. అందుకే శత్రువులను గట్టిగా దెబ్బతీశామని తెలిపారు.

అహ్మదాబాద్‌లో సిరియా పౌరుడి అరెస్ట్!

వీడియోలు చూపిస్తూ గాజా కోసం విరాళాలు కావాలని కోరారు. “మీ సాయం వాళ్లకు ప్రాణదాతగా మారుతుంది” అని చెప్పారు. కానీ అసలైన బాధితుల దగ్గరకు ఒక్క రూపాయి కూడా వెళ్లలేదు. ఈ ముఠా లక్షల్లో డబ్బు సేకరించింది. అలీ జూలై 22న టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చాడు. కోల్‌కతా మీదుగా దేశంలోకి ప్రవేశించి, పలు ప్రాంతాలు తిరిగాడు. ఆగస్టు 2న అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో హోటల్‌పై దాడి చేశారు. అలీ వద్ద 3,600 అమెరికన్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON