శ్రామికుల హక్కులను గుర్తించే చరిత్రాత్మక దినోత్సవం మే డే అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి శ్రామికుడికి గౌరవం ఇవ్వడం మన కర్తవ్యం అని అన్నారు. మే డే సందర్భంగా చంద్రబాబు కార్మికులకు
శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పథంలో వెళ్తుందని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తుందని అన్నారు. కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

