loader

అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు – భారతీయులకు షాక్

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇకపై ఉద్యోగ అనుమతి పత్రాల (EAD) ఆటోమేటిక్ పొడిగింపు ఉండదు. ఈ కొత్త నియమం వల్ల వేలాది విదేశీ ఉద్యోగులు — ముఖ్యంగా భారతీయులు తమ పర్మిట్ రీన్యువల్ సమయానికి ఆమోదం పొందకపోతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. ఈ తాత్కాలిక తుది నియమం బుధవారం ప్రకటించబడగా, గురువారం నుంచే అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు, పర్మిట్ రీన్యువల్ కోసం దరఖాస్తు చేసిన ఉద్యోగులు 540 రోజుల […]

ప్రపంచంలోనే తొలి 5 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా Nvidia..

Nvidia సంస్థ అరుదైన రికార్డును అందుకుంది. చరిత్రలోనే తొలిసారిగా ఐదు ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్ సొంతం చేసుకున్న తొలి కంపెనీగా ఘనత సాధించింది. భారత్  జిడిపి ఐదు ట్రిలియన్ డాలర్లు అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే, భారత్, యూకే, జపాన్ దేశాల జిడిపి లను సైతం వెనక్కు నెట్టి ముందుకు దూసుకొని వెళ్ళింది. ఈ ఐదు ట్రిలియన్ డాలర్లను భారతీయ కరెన్సీలో మార్చినట్లయితే సుమారు 420 లక్షల కోట్లుగా చెప్పవచ్చు. CEO జెన్సెన్ హువాంగ్ సగర్వంగా ఈ ఘనతను […]

బ్రెజిల్‌లో భీకర కాల్పులు: 64 మంది మృతి

బ్రెజిల్‌లో మాదకద్రవ్యాల గ్రూప్, భద్రతా బలగాలు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో 64 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా అధికారులు ఉన్నట్టు వెల్లడించారు మాదక ద్రవ్యాల గ్రూపు డ్రోన్లతో సాయుధ దళాలపై దాడులకు పాల్పడింది. రెడ్ కమాండ్ గ్రూపు సభ్యులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు అధికారులు మృతి చెందారు. ఎదురుల్లో కాల్పుల్లో 60 మంది రెడ్ కమాండ్ చెందిన సభ్యులు హతమయ్యారు

డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవలపై అమెరికా సైన్యం దాడులు

తూర్పు పసిఫిక్ జలాల్లో మాదకద్రవ్యాలు తీసుకెళ్తున్నాయన్న అనుమానంతో అమెరికా సైన్యం మూడు దాడులు చేసింది. దాడులలో 14 మంది మరణించగా ఒకరు తప్పించుకున్నారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఒకే రోజు మూడు దాడులు జరపడం ఇదే ప్రథమం. ప్రాణాలతో బయటపడిన ఏకైకవ్యక్తిని మెక్సికన్ సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారులు రక్షించారని హేగ్సేత్ తెలిపారు. అయితే అతడిని అమెరికాకు అప్పగిస్తారా లేదా అన్నది వెల్లడి కాలేదు.

కెన్యాలో కూలిన విమానం.. 12 మంది మృతి

కెన్యా తీర ప్రాంతం క్వాలేలో ఇవాళ ఓ విమానం కూలింది. మాసాయి మారా జాతీయ రిజ‌ర్వ్ ఫారెస్టుకు టూరిస్టుల‌తో వెళ్తున్న విమానం కూల‌డంతో 12 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు చెప్పారు. కొండ‌లు, అట‌వీ ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ద‌యాని ఎయిర్ స్ట్రిప్‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో విమానం కూలిన‌ట్లుగుర్తించారు.  ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 12 మంది ఉన్నారు. ఏ కార‌ణం చేత విమానం కూలింద‌న్న కోణంలో ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

మిమ్మల్ని నోబెల్‌కు నామినేట్ చేశా- ట్రంప్‌‌నకు చెప్పిన జపాన్ ప్రధాని

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో జపాన్ ప్రధానమంత్రి సనాయీ తకాయిచీ కీలక విషయాన్ని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌‌ను తాను నామినేట్ చేశానని ఆమె వెల్లడించారు. టోక్యోలోని అకాసకా ప్యాలెస్‌లో ట్రంప్‌తో జపాన్ ప్రధానమంత్రి సనాయీ తకాయిచీ భేటీ అయ్యారు. థాయ్‌లాండ్ – కంబోడియా శాంతి ఒప్పందం, చారిత్రక గాజా కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా ప్రపంచ శాంతిని ట్రంప్ పెంపొందించారని ఆ సందర్భంగా సనాయీ తకాయిచీ కొనియాడారు. దౌత్యమార్గాల ద్వారా అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచ […]

ఓపెన్ఏఐ బంపరాఫర్.. భారత్‌లో ‘చాట్‌జీపీటీ గో’ ఫ్రీ ఫ్రీ

భారత్‌లో తన ఉనికిని మరింత విస్తరించుకునేందుకు, ఏఐ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు.. ఇక్కడి యూజర్లు అందరికీ సంవత్సరం పాటు ఉచితంగా ఈ చాట్‌జీపీటీ గో సేవల్ని అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఇది నవంబర్ 4 నుంచి వర్తిస్తుందని పేర్కొంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులతో పాటుగా.. ఇప్పటికే ఉన్న చాట్‌‌జీపీటీ గో యూజర్లకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది.

అమెరికాలో షట్‌డౌన్‌.. 8 వేల విమానాలపై దెబ్బ

అమెరికాలో ప్రభుత్వం ‘షట్‌డౌన్‌’లోకి వెళ్లిపోయాక ఆ దేశంలోని విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్ల కొరత కారణంగా ఆదివారం యూఎస్‌ అంతటా దాదాపు 8 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం, పలు సర్వీసుల రద్దు ఉంటుందని యూఎస్‌ రవాణా కార్యదర్శి సీన్‌ డఫ్ఫీ ట్రంప్‌ సర్కార్‌ను హెచ్చరించారు.

భారత యువతిపై అత్యాచారం.. విదేశాల్లో జాతి వివక్ష దారుణం!

వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలోని వాల్సల్‌లో మరో దారుణ ఘటన జరిగింది. 20 ఏళ్ల భారతీయ ఎన్నారై, పంజాబీ సిక్కు యువతిపై 30 ఏళ్ల శ్వేత జాతి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని జాత్యహంకారంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. బ్రిటన్ టైమ్ ప్రకారం శనివారం (అక్టోబర్ 25, 2025) సాయంత్రం 7:15 గంటల సమయంలో పార్క్ హాల్ ప్రాంతంలో  బాధితురాలి ఇంటి తలుపును పగలగొట్టి, ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేసినట్లు బ్రిటన్ లోని సిక్కు […]

డంకీ రూట్‌లో ప్రవేశం.. 54 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా

డంకీ మార్గంలో తమ దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలతో 54 మంది భారతీయులను అమెరికా తాజాగా వెనక్కిపంపింది. అందులో అత్యధికంగా హర్యాణా వాసులే కావడం గమనార్హం. అంబాలా (5), యమునా నగర్‌ (4), కురుక్షేత్ర (4), జింద్‌ (3), సోనిపట్‌ (2), పంచకుల, పానిపట్‌, రోహ్తక్‌, ఫతేహాబాద్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వారంతా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON