loader

వార్నర్ బ్రదర్స్‌ని కొనేసిన నెట్ ఫ్లిక్స్.. కళ్ళు బైర్లుకమ్మే డీల్ ఇది

వార్నర్ బ్రదర్స్ కు చెందిన టీవీ, సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్‌ కుదుర్చుకుంది. 1923లో నలుగురు సోదరులు స్థాపించిన వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్ OTTని 72 బిలియన్ US డాలర్లకు లేదా భారతీయ రూపాయలలో  7 లక్షల 43 వేల 630 కోట్లకు కొనుగోలు చేసిన ఒప్పందం ఫైనల్‌గా ప్రకటించబడింది. దీంతో హాలీవుడ్‌లో అత్యంత విలువైన కంటెంట్ కలెక్షన్ కలిగిన సంస్థగా నెట్‌ఫ్లిక్స్ మరింత బలోపేతం కానుంది.

క్రిస్మస్ వేడుకల్లోకి దూసుకెళ్లిన కారు: పది మంది మృతి

ఫ్రాన్స్ దేశంలో ఓవర్సీస్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గ్వాడెలోప్‌లోని సెయింట్ ఆన్‌లో క్రిస్మస్ వేడుకలు జరగుతుండగా వారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు డ్రైవర్ అనారోగ్య సమస్యలు  తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగిందని […]

వ్లాదిమిర్‌ పుతిన్‌కు మోదీ ఇచ్చిన అమూల్యమైన కానుకలు..

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన సందర్భంగా మొదటగా ఆయనకు భగవద్గీత ప్రతిని రష్యా లిపీలో బహుకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో 5 అద్భుతమైన కానుకలను కూడా మొదీ పుతిన్‌కు అందించారు. ప్రధానంగా ఇందులో చెప్పుకోదగ్గది కాశ్మీరీ కుంకుమపువ్వు, అసోంకు చెందిన ఫేమస్ బ్లాక్ టీ, మహారాష్ట్ర హస్త కళాకారులతో తయారుచేసిన వెండి గుర్రాలు, మార్బుల్ చెస్ బోర్డ్ ,ముర్షిదాబాద్ కు చెందిన వెండి టీ కప్పుల సెట్ వంటివి బహుమతులుగా అందజేశారు

అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13 మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరో విద్యార్థి ఉంటున్నారు. శుక్రవారం అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెలుగు విద్యార్థులిద్దరూ తీవ్రంగా గాయపడ్డంతో అగ్నిమాపక సిబ్బంది వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

ఎలాన్ మస్క్​కు భారీ షాక్- ఎక్స్​కు రూ.12,570 కోట్లు ఫైన్

దిగ్గజ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు ఈయూ ఆన్ లైన్ కంటెంట్ నియమాలను ఉల్లంఘించినందుకు ఎక్స్​కు 120 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.12,570 కోట్లు) ఫైన్ వేసింది. డిజిటల్  సర్వీసెస్ యాక్ట్ (డీఎస్ఏ) కింద ఎక్స్​కు ఈ ఫైన్​ను ఈయూ విధించింది. ఈ చట్టం కింద పడిన తొలి జరిమానా ఇదే కావడం గమనార్హం. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్​పై  నియమాలను ఎక్స్ ఉల్లంఘించినట్లు తేలడంతో, రెండేళ్ల దర్యాప్తు అనంతరం యూరోపియన్ కమిషన్  జరిమానాను […]

భారత్‌లో అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సహకరిస్తాం: ద్వైపాక్షిక భేటీలో పుతిన్‌

భారత్‌, రష్యా స్నేహసంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్​. అనేక విషయాలపై మోదీ, తాను చర్చించామని చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించామని తెలిపారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని,  ఇరుదేశాల ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. చమురు, సహజవాయువు, బొగ్గు సరఫరాకు ఒప్పందాలు చేసుకున్నామని, వైద్య, వ్యవసాయ రంగాల్లో కలిసి ముందుకెళ్తామని వివరించారు. భారత్‌లోని అణువిద్యుత్‌ ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్లు క్రాష్.. స్టాక్ మార్కెట్ యాప్‌లు బ్లాక్, ఆగిన ట్రేడింగ్

భారతదేశంలో వేలాది వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లు ఉపయోగించే ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ మరియు డెలివరీ సేవ అయిన క్లౌడ్‌ఫ్లేర్‌లో గురువారం ఒక భారీ అంతరాయం చోటుచేసుకుంది. ఈ అనుకోని సాంకేతిక సమస్య వలన దేశవ్యాప్తంగా అనేక ఆన్‌లైన్ సేవలు ఒకేసారి దెబ్బతిన్నాయి.ప్రధానంగా క్లౌడ్‌ఫ్లేర్‌పై ఆధారపడిన APIలు మరియు బ్యాకెండ్ సర్వర్‌లు పనిచేయకపోవడం వల్ల యూజర్లు లాగిన్ అవ్వడం, ట్రేడింగ్ ఆర్డర్‌లు పెట్టడం, లైవ్ మార్కెట్ డేటా చూడడం వంటి పనులు మధ్యలో ఆగిపోయాయి.

రాజ్‌ఘాట్‌ను సందర్శించిన పుతిన్‌.. గాంధీజీ సమాధి వద్ద నివాళి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.  పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అంతకు ముందు రాజ్‌ భవన్‌కు చేరుకున్న పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము,   ప్రధాని మోదీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు పుతిన్‌.

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండు రోజుల భారత పర్యటన కోసం న్యూఢిల్లీకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ అజెండాలో భాగంగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఘన స్వాగతం పలికారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. భారతదేశ ప్రపంచ దౌత్యంలో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా హాజరయ్యారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించిన పుతిన్, ప్రధాని మోదీతో ప్రతినిధి బృందం స్థాయి చర్చలకు హాజరయ్యారు.

భారత్‌లో పుతిన్ పర్యటన.. అమూల్యమైన కానుకతో సర్ ప్రైజ్ చేసిన ప్రధాని మోదీ..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల  భారత్ లో పర్యటనకు వచ్చారు. పుతిన్ కు ప్రధాని మోదీ అపురూమైన కానుకతో సర్ ప్రైజ్ చేశారు.  పీఎం నివాసంలో మోదీ విందును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత.. పాటూ పుతిన్ కు ప్రధాని మోదీ.. రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీతను ఆయనకు అందించారు.  ఈ నేపథ్యంలో భగవద్గీత గొప్పతనం గురించి, తన అనుభవాల్ని గురించి ప్రధాని మోదీ పుతిన్ కు వివరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON