రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అంతకు ముందు రాజ్ భవన్‌కు చేరుకున్న పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు పుతిన్.

