రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా మొదటగా ఆయనకు భగవద్గీత ప్రతిని రష్యా లిపీలో బహుకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో 5 అద్భుతమైన కానుకలను కూడా మొదీ పుతిన్‌కు అందించారు. ప్రధానంగా ఇందులో చెప్పుకోదగ్గది కాశ్మీరీ కుంకుమపువ్వు, అసోంకు చెందిన ఫేమస్ బ్లాక్ టీ, మహారాష్ట్ర హస్త కళాకారులతో తయారుచేసిన వెండి గుర్రాలు, మార్బుల్ చెస్ బోర్డ్ ,ముర్షిదాబాద్ కు చెందిన వెండి టీ కప్పుల సెట్ వంటివి బహుమతులుగా అందజేశారు

