loader

పుతిన్ పై ఉక్రెయిన్ దాడికి ఆధారాలు లేవు

గత మూడురోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసం సమీపంలో డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందని, ఆ దేశంపై ఆరోపణలు చేశారు. దీన్ని ఉక్రెయిన్ దేశం ఖండించినా రష్యామాత్రం దీన్ని నమ్మలేదు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. క్రెమ్లిన్ ఆరోపించినట్లుగా ఉక్రెయిన్, పుతిన్ ను హత్య చేయడానికి ప్రయత్నించలేదని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ స్పష్టం చేసింది.

న్యూఇయర్‌ పార్టీలో తీవ్ర విషాదం.. 40కి చేరిన మృతుల సంఖ్య

స్విట్జర్లాండ్‌లో లే కాన్ట్సెలేషన్‌ అనే బార్‌లో జరిగిన న్యూఇయర్‌ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకూ 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. ప్రమాద సమయంలో బార్‌లో 100 మందికిపైగా ఉన్నారు. పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు బార్‌ మొత్తం వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కొత్త ఏడాది రోజున ఈ ఘటన అనేక […]

న్యూఇయర్‌ వేళ విషాదం.. జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి

కొత్త ఏడాది రోజున జర్మనీ లో ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం మల్కాపూర్‌కు చెందిన తోకల హృతిక్‌ రెడ్డిగా గుర్తించారు. అతను ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లినట్లు తెలిసింది. హృతిక్‌ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో.. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు.

స‌బ్‌వే స్టేష‌న్ వ‌ద్ద న్యూయార్క్ మేయ‌ర్‌గా జోహ్రాన్ మామ్‌దానీ ప్ర‌మాణ స్వీకారం

అమెరికాలోని న్యూయార్క్ సిటీ మేయ‌ర్‌గా జోహ్రాన్ మామ్‌దానీ గురువారం రాత్రి ప్ర‌మాణ స్వీకారం చేశారు. చ‌రిత్రాత్మ‌క‌మైన మ‌న్‌హ‌ట్ట‌న్ స‌బ్‌వే స్టేష‌న్ వ‌ద్ద ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఖురాన్ గ్రంధంపై చేయి వేసి ఆయ‌న ప్ర‌మాణం చేశారు. మేయ‌ర్‌గా ప్ర‌మాణ స్వీకారం చేప‌ట్ట‌డాన్ని గౌర‌వంగా, జీవిత‌కాల అవ‌కాశంగా భావిస్తున్న‌ట్లు మామ్‌దానీ తెలిపారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయ‌ర్‌గా మామ్‌దానీ నిలిచారు. ఓల్డ్ సిటీ హాల్ స‌బ్‌వే స్టేష‌న్ వ‌ద్ద ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

రష్యాతో శాంతి ఒప్పందానికి 10 శాతం దూరంలోనే ఉన్నాం: జెలెన్‌స్కీ

రష్యాతో యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి తమ దేశం కేవలం 10 శాతం దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాలకు ఇంకా పరిష్కారాల్ని కనుగొనాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా చేతిలోకి ఉక్రెయిన్ భూభాగాల్ని వదిలేది లేదని తేల్చి చెప్పారు. అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా – ఉక్రెయిన్ శాంతి ఒప్పందం 90 శాతం సిద్ధమైందని జెలెన్‌స్కీ తెలిపారు

న్యూ ఇయర్ వేళ.. జపాన్ లో భారీ భూకంపం..

కొత్త సంవత్సరం ప్రారంభ వేళ జపాన్‌ దేశాన్ని  భారీ భూకంపం వణికించింది. జపాన్‌ తూర్పు నోడా ప్రాంత తీరంలో బుధవారం రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. జపాన్ వాసులు 2026 నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ భూకంపం సంభవించడం తీవ్ర ఆందోళన కలిగించింది.  భూకంప కేంద్రం నోడా నగరానికి తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర మట్టానికి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు […]

టారిఫ్స్ వల్లే అమెరికాకు రికార్డు స్థాయిలో పెట్టుబడులు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన విధానాలపై మాట్లాడారు. టారిఫ్‌ల విధానం వల్లే అమెరికాలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అలాగే వెనిజువేలా అధ్యక్షుడు నికోలాస్‌ మదురో ప్రభుత్వంపై ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. మరోవైపు చికాగో, లాస్‌ ఏంజెలెస్‌, పోర్ట్‌లాండ్‌ నగరాల నుంచి నేషనల్‌ గార్డ్‌ను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూడు కీలక పరిణామాలు అమెరికా రాజకీయాల్లో, అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.

ఓ AI స్టార్టప్‌ను 2 బిలియన్‌ డాలర్లకు కొనేసిన మెటా..!

మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ మనుస్‌ను కొనుగోలు చేస్తోంది. మెటా 2 బిలియన్‌ డాలర్లకు పైగా ఒప్పందాన్ని ముగించిందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. సింగపూర్‌కు చెందిన చైనీస్ మూలాలు కలిగిన ప్లాట్‌ఫామ్ మనుస్, ఈ సంవత్సరం ప్రారంభంలో తన మొదటి జనరల్‌ పర్పస్‌ AI ఏజెంట్‌ను ప్రారంభించింది.   వినియోగదారులు పరిశోధన, కోడింగ్, అనేక ఇతర పనుల కోసం దాని సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. మనుస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు, వ్యాపారాల రోజువారీ […]

బెర్క్‌షైర్ సీఈఓ పదవి నుంచి దిగిపోనున్న దిగ్గజ ఇన్వెస్టర్

ప్రముఖ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓ పదవి నుండి దిగిపోనున్నట్లు ప్రకటించారు. తన తర్వాత గ్రెగ్ అబెల్‌కు సీఈఓ బాధ్యతలు అప్పగించారు. వారెన్ బఫెట్ 1965లో బెర్క్ షైర్ హాత్‌వే బాధ్యతలు చేపట్టారు. క్రమశిక్షణ,దీర్ఘకాలిక వ్యూహాలతో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఇచ్చారు. వీటిని అనుసరించిన ఎంతో మంది లాభాలు పొందారు. దీంతో స్టాక్ మార్కెట్‌ ప్రపంచంలో ఒక గొప్ప ఇన్వెస్టర్‌గా పేరు గడించాడు. పెట్టుబడులతో ప్రపంచంలోనే కుబేరుడిగా నిలిచాడు.

జర్మనీలోని బ్యాంకులో భారీ దోపిడీ.. 316 కోట్లు కొల్లగొట్టిన దొంగలు

జర్మనీలోని ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గెల్సెన్‌కిర్చెన్‌లోని స్పార్కాస్కై బ్యాంకులో రూ.316 కోట్లను దోపిడీ చేశారు. క్రిస్మస్ సెలవులు కావడంతో రెండు రోజులు బ్యాంకులోనే ఉండి 3250 సెఫ్టీ డిపాజిట్లను కొల్లగొట్టారు. అలాగే లాకర్లలోని నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బుయర్ ప్రాంతంలో ఉన్న స్పార్కాసై బ్యాంకు శాఖను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజి నుంచి బ్యాంకులోకి ప్రవేశించారు. గ్యారేజి నుంచి భూగర్భంలో ఉన్న వాల్ట్ రూమ్‌కు డ్రిల్‌తో రంధ్రం చేసి బ్యాంకులోకి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON