కొత్త సంవత్సరం ప్రారంభ వేళ జపాన్ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. జపాన్ తూర్పు నోడా ప్రాంత తీరంలో బుధవారం రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. జపాన్ వాసులు 2026 నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ భూకంపం సంభవించడం తీవ్ర ఆందోళన కలిగించింది. భూకంప కేంద్రం నోడా నగరానికి తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర మట్టానికి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

