రష్యాతో యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి తమ దేశం కేవలం 10 శాతం దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. అయితే కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాలకు ఇంకా పరిష్కారాల్ని కనుగొనాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా చేతిలోకి ఉక్రెయిన్ భూభాగాల్ని వదిలేది లేదని తేల్చి చెప్పారు. అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా – ఉక్రెయిన్ శాంతి ఒప్పందం 90 శాతం సిద్ధమైందని జెలెన్స్కీ తెలిపారు

