వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్యను బంధించాం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వెనిజులాపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఈ మెరుపు ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోతో పాటు ఆయన భార్యను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిద్దరినీ బంధించి వెనిజులా నుంచి రహస్య ప్రదేశానికి తరలించినట్లు అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ట్రూత్ సోషల్’ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. “అమెరికా వెనిజులాపై భారీ స్థాయి దాడి చేసింది. మాదురో దంపతులు ఇప్పుడు మా అదుపులోనే ఉన్నారు” అని స్పష్టం చేశారు.

