ఇరాన్లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే ”వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుంది” అని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ”మేం అన్నీ సిద్ధం చేసుకుని, బయలుదేరడానికి రెడీగా ఉన్నాం” అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో ”జోక్యం చేసుకోవడమేనని” పేర్కొంది. ట్రంప్ జోక్యం చేసుకుంటే పశ్చిమాసియా అంతా అల్లకల్లోలమవుతుందని ”జాగ్రత్తగా ఉండాలని” హెచ్చరించారు.

