బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ, బస్సు ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదంలో బస్సు క్యాబిన్ లారీలోకి చొచ్చుకునిపోయింది. అలాగే లారీలోని ఇసుక మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని కారాజిన్హో సమీపాన జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

