loader

ప్రపంచానికి అన్నపూర్ణగా..చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా భారత్‌!

భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. జనవరి 4న భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది. దేశం మొత్తం వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉంది. భారత్‌ ప్రపంచానికి అన్నపూర్ణగా మారింది. భారతదేశం ఇప్పుడు  పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేస్తోందని, తగినంత ఆహార ధాన్యాల […]

డ్రగ్ డీలర్లతో డీల్స్..స్మగ్లింగ్..వెనిజులా అధ్యక్షుడి భార్యపై సంచలన ఆరోపణలు!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య, ఆ దేశ ప్రథమ మహిళ సిలియా ఫ్లోరస్‌పై అమెరికా న్యాయస్థానం తీవ్రమైన క్రిమినల్ అభియోగాలను మోపింది. తన కుటుంబం, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అమెరికాలోకి వేల టన్నుల కొకైన్‌ను అక్రమంగా పంపించారనే ఆరోపణలతో, డ్రగ్ డీలర్ల నుంచి భారీగా లంచాలు తీసుకోవడం, కొకైన్ తరలించేందుకు ప్రైవేటు ఎయిర్‌పోర్టులను దుర్వినియోగం చేయడం, డ్రగ్స్ రాకెట్‌లో ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం వంటి అనేక ఆరోపణలు ఇప్పుడు సిలియా ఫ్లోరస్‌ను […]

ఒకరు గడ్డం, టోపీ పెట్టుకున్న జిహాదీ, మరొకరు కోటు, ప్యాంటు పెట్టుకున్న జిహాదీ: తస్లీమా నస్రీన్

బంగ్లాదేశ్‌లో రెండు రకాల జిహాదీలు ఉన్నారని తస్లీమా నస్రీన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు. “ఒకరు గడ్డం ఉన్న, తలపై టోపీ ధరించిన, మదర్సాలో చదువుకున్న జిహాదీ, మరొకరు పాశ్చాత్య దుస్తులు ధరించిన, విశ్వవిద్యాలయంలో డిగ్రీ పొందిన జిహాదీ.” అంటూ ఆమె పేర్కొన్నారు. రెండు రకాల జిహాదీల లక్ష్యం ఒక్కటే అని రచయిత తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. భారతదేశంపై శత్రుత్వం వారి కల. భారతదేశంపై యుద్ధం చేసి బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయడం వారి […]

అగ్గిరాజేసిన ఆ వివాదం…ఐపీఎల్ 2026పై నిషేధం..?

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (IPL) కి బంగ్లాదేశ్‌లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. అయితే, 2026 ఐపీఎల్ సీజన్ ప్రసారాలు బంగ్లాదేశ్‌లో నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ, దౌత్యపరమైన విభేదాలు క్రికెట్ మైదానానికి పాకడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల కావడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది.

వెనుజులా అయిపోయింది.. తర్వాత ఆ దేశాలే, ట్రంప్ వార్నింగ్..!

వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మదురో చేతికి సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టి అమెరికాకు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో అమెరికా చర్యను పలు లాటిన్ అమెరికా దేశాలు తప్పుపట్టాయి. దీనిపై స్పందించిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశాలను కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పడు వెనుజులా అయిపోయింది.. తర్వాత మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాల సంగతి చూస్తాం అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

ఇదంతా ఆయిల్ కోసమే.. ట్రంప్‌పై కమలా హారిస్ ఆగ్రహం

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వెనిజులా అధ్యక్షుడు మదురోపై ట్రంప్ తీసుకున్న సైనిక చర్యలను తీవ్రమైనంగా విమర్శించారు. ఆమె ప్రకారం, మదురో డిక్టేటర్ అయినప్పటికీ, అమెరికా ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఏవిధమైన అంతర్జాతీయ అనుమతులు లేకుండా చర్యలు చేపట్టడం పొరపాటుగా ఉందని గుర్తించారు. కేవలం వెనిజులా చమురు వనరుల కోసం సైనిక ప్రాణాలను పణంగా పెడుతూ ఉండటం అనవసరమైనది. ఈ చర్యలు లాటిన్ అమెరికా దేశాల సమూహంలో అమెరికా అవాంఛనీయ ఇమేజ్‌ను సృష్టిస్తాయని సూచించారు.

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌

వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంతో ఆ దేశ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. వెనెజువెలా రాజధాని కారకాస్​లో 1969లో డెల్సీ రోడ్రిగ్స్​ జన్మించారు. వామపక్ష గెరిల్లా నాయకుడు జార్జ్​ అంటోనియో కుమార్తెనె ఈ డెల్సీ రోడ్రిగ్స్​. మదురో ప్రభుత్వంలో కమ్యూనికేషన్​, విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించిన డెల్సీ, 2018లో ఉపాధ్యక్షురాలిగా నియామకం అయ్యారు.

ట్రంప్ సంచలన ప్రకటన.. ‘ఇకపై వెనెజులాను అమెరికా పాలిస్తుంది’

అమెరికా.. వెనెజులా రాజధానిపై వైమానిక దాడులు చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో సురక్షిత పరిస్థితులు ఏర్పడే వరకు.. సరైన న్యాయపరమైన అధికారాల బదిలీ జరిగే వరకు వెనెజులాను అమెరికాను పాలిస్తుందని తెలిపారు. వెనెజులా సైన్యాన్ని నిర్వీర్యం చేశామని, భవిష్యత్తులోనూ అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మదురోకు మద్దతిస్తున్న వారిని ట్రంప్ హెచ్చరించారు.

వెనెజువెలాలో స్వేచ్ఛా గంట మోగింది: నోబెల్ గ్రహీత మచాడో

వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అమెరికా బంధించడంతో వెనుజువెలా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో సంచలన ప్రకటన చేశారు. వెనుజువెలావాసులారా స్వేచ్ఛ గంట మోగిందంటూ వ్యాఖ్యానించారు. ఇది స్వేచ్ఛ కోసం సమయమంటూ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు.వెనుజువెలా ప్రజలపై, ఇతర దేశాల పౌరులపై జరిగిన ఘోర నేరాలకు ఆయన ఇప్పుడు జవాబుదారుడవుతారని మచాడో పేర్కొన్నారు

పుట్టుకతో అంధులుకు సాధారణ కంటి కంటే పవర్‌ఫుల్‌ చూపు!

కాలిఫోర్నియాకు చెందిన న్యూరోటెక్నాలజీ సంస్థ ఎలోన్ మస్క్ న్యూరాలింక్ అంధులకు శుభవార్త చెప్పింది. ‍ న్యూరాలింక్‌తో పుట్టుకతో అంధులైన వారికి సైతం 2026లో మొదటి మానవ పరీక్షలతో కళ్లు తెప్పించే దిశగా ప్రధాన చర్యలు తీసుకుంటోంది. దృష్టిని పునరుద్ధరించే లక్ష్యంతో న్యూరాలింక్ మెదడు చిప్ అయిన బ్లైండ్‌సైట్ సెప్టెంబర్ 2024లో US FDA నుండి ‘బ్రేక్‌త్రూ డివైజ్‌’ హోదాను పొందింది. 2026 ప్రారంభంలో న్యూరాలింక్ పూర్తిగా అంధులకు పరిమిత దృష్టిని అందించే లక్ష్యంతో బ్లైండ్‌సైట్ మొదటి మానవ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON