వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య, ఆ దేశ ప్రథమ మహిళ సిలియా ఫ్లోరస్‌పై అమెరికా న్యాయస్థానం తీవ్రమైన క్రిమినల్ అభియోగాలను మోపింది. తన కుటుంబం, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అమెరికాలోకి వేల టన్నుల కొకైన్‌ను అక్రమంగా పంపించారనే ఆరోపణలతో, డ్రగ్ డీలర్ల నుంచి భారీగా లంచాలు తీసుకోవడం, కొకైన్ తరలించేందుకు ప్రైవేటు ఎయిర్‌పోర్టులను దుర్వినియోగం చేయడం, డ్రగ్స్ రాకెట్లో ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం వంటి అనేక ఆరోపణలు ఇప్పుడు సిలియా ఫ్లోరస్‌ను చుట్టుముట్టాయి.

