వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అమెరికా బంధించడంతో వెనుజువెలా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో సంచలన ప్రకటన చేశారు. వెనుజువెలావాసులారా స్వేచ్ఛ గంట మోగిందంటూ వ్యాఖ్యానించారు. ఇది స్వేచ్ఛ కోసం సమయమంటూ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు.వెనుజువెలా ప్రజలపై, ఇతర దేశాల పౌరులపై జరిగిన ఘోర నేరాలకు ఆయన ఇప్పుడు జవాబుదారుడవుతారని మచాడో పేర్కొన్నారు

