loader

మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఈ ఏడాది జనవరిలో 20 వేల ఉద్యోగుల తొలగిస్తున్నారా?

ఈ ఏడాది జనవరిలో మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్, ఎక్స్‌బాక్స్ , గ్లోబల్ సేల్స్ విభాగాల్లో లేఆఫ్స్‌ జరగనున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ వాదనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో,ఆ ఊహాగానాలు పూర్తిగా అబద్దమని మైక్రోసాఫ్ట్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ షా సోషల్ మీడీయా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “100 శాతం కల్పితం / ఊహాజనితం / తప్పు” అనే బదులిచ్చారు.

ఇరాన్ లో పోలీసును కాల్చి చంపిన దుండగులు.. కారును వెంబడించి మరీ..

నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ లో తాజాగా కొందరు దుండగులు ఒక పోలీస్ ఆఫీసర్ ను కాల్చి చంపారు. ఇరాన్ లోని ఆగ్నేయ సిస్టాన్-బలూచెస్తాన్ ప్రాంతంలో, బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి చేతిలో గన్ మెషీన్తో వేగంగా వెళ్తున్న కారుపై కాల్పులు జరిపారు. పోలీసు మరింత వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. బుల్లట్లు తగలడంతో పోలీసు మరణించాడు. ఈ క్రమంలో కారు దూరంగా వెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనను నిందితులే వీడియో తీయడం […]

ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ కాల్పులకు ఓ మహిళ బలి

అమెరికాలో దారుణం జరిగింది. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు మారణహోమం సృష్టించారు. వలసదారులపై కాల్పులకు తెగబడ్డారు. బుధవారం మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ లో ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంకోవైపు ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు నిర్వహించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఫెడరల్ ఏజెంట్లు రంగంలోకి దిగి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్.. కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాయి. దీంతో రెనీ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతి తర్వాత […]

ట్రంప్ డ్రీమ్ మిలటరీ- ఏకంగా రూ.135లక్షల కోట్లు కేటాయింపు

అమెరికా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ‘డ్రీమ్ మిలిటరీ’ నిర్మాణం కోసం భారీగా నిధులను వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. 2027 ఆర్థిక సంవత్సరానికి గానూ సైనిక బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.135 లక్షల కోట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా రక్షణ బడ్జెట్ 1 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, దీనిని ఏకంగా 50 శాతం పెంచుతున్నట్లు ఆయన వెల్లడించడం సంచలనంగా మారింది.

రష్యా అడ్డుకున్నా.. వెనెజువెలా చమురు నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా

వెనెజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించిన అమెరికారెండు వారాలుగా వెనెజువెలాకు చెందిన చమురునౌకను  స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అక్కడికి ప్రత్యేక నౌకను పంపింది. కానీ, సముద్ర జలాల్లో ఆటుపోట్ల కారణంగా స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. ఇదే క్రమంలో రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మోహరించింది. అయినప్పటికీ అమెరికా ఆ నౌకను ఐస్ లాండ్ తీరంలో స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, మంత్రి ఆనం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆయన స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. అంతేకాకుండా పండితులు ధరమ్ బీర్ గోకుల్‌కు వేదాశీర్వచనం అందజేశారు.

ఆందోళనకారులపైకి దూసుకెళ్లిన బస్సు: 10 మంది మృతి… వీడియో వైరల్

ఇజ్రాయెల్ దేశంలోని జెరూసలెంలో బస్సు బీభత్సం సృష్టించింది. శామ్గర్ ప్రాంతంలోని యర్మియుహులో అందోళనకారులపైకి బస్సు అదుపుతప్పి దూసుకెళ్లడంతో పది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇజ్రాయెల్ ప్రజలకు నిర్బంధంగా సైనిక విధులు కేటాయించడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వారిపైకి బస్సు దూసుకెళ్లింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు వెంటనె డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బ్యాంకింగ్‌ రంగంలో AI ప్రకంపనలు.. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు మాయం!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రాకతో దాదాపు అన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్‌లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, బ్యాంకులు AI వినియోగాన్ని పెంచుతున్నాయి. అదే సమయంలో ఫిజికల్‌ బ్రాంచ్ నెట్‌వర్క్‌ను తగ్గించడం కొనసాగిస్తున్నాయి. 2026 నుంచి పెద్ద మొత్తంలో బ్యాంక్‌ ఉద్యోగాలు కోల్పోవచ్చని పేర్కొంది. రాబోయే ఐదు సంవత్సరాలలో 200,000 కంటే ఎక్కువ బ్యాంకింగ్ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ అంచనా వేసింది.

అమెరికా దాడి చేస్తే.. ఆయుధాలు చేప‌డుతాం: కొలంబియా అధ్య‌క్షుడి వార్నింగ్‌

కొలంబియా అధ్య‌క్షుడు గుస్తావో పెట్రో వార్నింగ్ ఇచ్చారు. ఒక‌వేళ అమెరికా త‌మ‌పై దాడి చేస్తే, అప్పుడు ఆయుధాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. నేనేమీ మిలిట‌రీ వ్య‌క్తిని కాదు అని, కానీ యుద్ధం గురించి తెలుసు అని, 1989లో జ‌రిగిన శాంతి ఒప్పందం ప్ర‌కారం ఆయుధాన్ని ప‌ట్టుకోను అని, కానీ స్వ‌దేశం కోసం మాత్రం ఆయుధాన్ని చేత‌బూనాల్సి వ‌స్తుంద‌ని పెట్రో అన్నారు. ఎం-19 క‌మ్యూనిస్టు గెరిల్లా గ్రూపులో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. 1980 త‌ర్వాత ఆయుధాలు వీడి, కొలంబియా […]

ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో

వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సోమవారం ఫెడరల్ కోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ సహా పలు తీవ్ర ఆరోపణలపై తమను తాము నిర్దోషులుగా ప్రకటించుకున్నారు. తాను ఇంకా వెనిజులా అధ్యక్షుడినేనని న్యాయమూర్తి ముందు మదురో చెప్పారు. కోర్టు నుండి బయటకు వచ్చాక ‘నేను యుద్ధ ఖైదీని’ అని చెప్పారు. మదురో న్యాయవాది దీనిని సైనిక అపహరణగా పేర్కొంటూ చట్ట ఉల్లంఘన అన్నారు. తనను విదేశాలలో అరెస్టు చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాన్ని, చట్టపరమైన ప్రక్రియ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON