మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, మంత్రి ఆనం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆయన స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. అంతేకాకుండా పండితులు ధరమ్ బీర్ గోకుల్‌కు వేదాశీర్వచనం అందజేశారు.

