వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సోమవారం ఫెడరల్ కోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ సహా పలు తీవ్ర ఆరోపణలపై తమను తాము నిర్దోషులుగా ప్రకటించుకున్నారు. తాను ఇంకా వెనిజులా అధ్యక్షుడినేనని న్యాయమూర్తి ముందు మదురో చెప్పారు. కోర్టు నుండి బయటకు వచ్చాక ‘నేను యుద్ధ ఖైదీని’ అని చెప్పారు. మదురో న్యాయవాది దీనిని సైనిక అపహరణగా పేర్కొంటూ చట్ట ఉల్లంఘన అన్నారు. తనను విదేశాలలో అరెస్టు చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాన్ని, చట్టపరమైన ప్రక్రియ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపించారు.

