loader

వరుసపెట్టి ఈమెయిల్స్‌తో యూజర్లలో టెన్షన్.. వర్రీ వద్దన్న ఇన్‌స్టాగ్రామ్

గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లోని యూజర్లకు వరుసపెట్టి పాస్‌వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లాయి. ఇన్‌స్టా మాత్రం ఈ వార్తలను ఖండించింది. తమ యూజర్ల డేటాకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసింది. అంతా సవ్యంగానే ఉందని వివరణ ఇచ్చింది. ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. చిన్న సాంకేతిక లోపం కారణంగా యూజర్లకు పాస్‌వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లాయని ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్ వేదికగా తెలిపింది. డేటా భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని తెలిపింది.

గ్రోక్ అసభ్య కంటెంట్ ఎఫెక్ట్.. 600 అకౌంట్లు డిలీట్..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ను ఉపయోగించి కొందరు అశ్లీల కంటెంట్‌ను సృష్టించారంటూ కేంద్రం సదరు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టిన ‘ఎక్స్’.. సుమారు 600 అకౌంట్లను వెంటనే డిలీట్ చేసింది. అలాగే ఆ కంటెంట్‌తో సంబంధమున్న సుమారు 3,500 పోస్టులను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌లో అశ్లీల కంటెంట్‌ను అనుమతించబోమని, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని ‘ఎక్స్’ హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సిరియాపై అమెరికా ప్రతీకార దాడులు

సిరియాపై అమెరికా ప్రతీకార దాడులు చేస్తుంది. ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ పేరుతో అమెరికా దాడులు దిగుతోంది. గత నెలలో ఐసిస్ దాడుల్లో ఇద్దరు అమెరికన్ సైనికులు మృతి చెందడంతో ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుంది. సిరియాలో ఐసిసి తీవ్రవాదుల స్థావరాలపై శనివారం ఉదయం అమెరికా వైమానికి దళం దాడులకు పాల్పడుతోంది. నెల వ్యవధిలో అమెరికా సైనికులు సిరియాపై దాడి చేయడం ఇది రెండోసారి.

గులాబీ రంగులో ఆకాశం.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండరు!

బ్రిటన్‌లో అక్కడి ఆకాశం అకస్మాత్తుగా గులాబీ రంగులోకి మారడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఫొటోలను తీసి నెట్టింట పంచుకున్నారు. బర్మింగ్‌హమ్‌లో ఈ అద్భుత దృశ్యం కనిపించింది అక్కడి సెయింట్ ఆండ్రూ స్టేడియంలో గులాబీ రంగు ఎల్‌ఈడీ లైట్‌లను ఏర్పాటు చేశారు. గాల్లోని మంచు కారణంగా ఈ వెలుతురు ఆకాశమంతా పరుచుకుని గులాబీ రంగులో మారినట్టు కనిపించింది. మంచు, మేఘాలు గులాబీ కాంతిని భూమి వైపు పంపించే అద్దాల్లాగా పనిచేశాయని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

జోహో ఫౌండర్ విడాకులు..రూ.15వేల కోట్ల వివాదం

జోహో ఫౌండర్.. టెక్ దిగ్గజం ‘శ్రీధర్ వెంబు’.. ఆయన భార్య ‘ప్రమీలా శ్రీనివాసన్’ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. జోహో కంపెనీ షేర్స్ భార్య ప్రమీలా శ్రీనివాసన్ తెలియకుండా..రూ.15వేల కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు, బాండ్ల బదిలీ బంధువులకు బదిలీ చేశారనేది ఆరోపణ,.అమెరికా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. నేను బదిలీ చేసిన షేర్స్ అన్నీ.. చట్టబద్ధంగా జరిగినవే అని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదం జోహో కంపెనీ ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది.

మస్క్‌కు షాక్.. గ్రోక్‌పై ఇండోనేషియాలో తాత్కాలిక నిషేధం

ఇండోనేషియా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎక్స్‌‌ఏఐ సంస్థకు చెందిన గ్రోక్‌ చాట్‌బాట్‌‌పై తాత్కాలిక నిషేధం విధించింది. వేల మంది యూజర్లు గ్రోక్‌తో అసభ్య డీప్ ఫేక్ చిత్రాలు రూపొందిస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రోక్‌పై నిషేధం విధించిన తొలి దేశంగా నిలిచింది. మహిళలు, చిన్నారుల డీప్ ఫేక్ చిత్రాలు రూపొందిస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో గ్రోక్‌పై తాత్కాలిక నిషేధం విధించామని గ్రోక్‌తో అసభ్య చిత్రాల రూపకల్పనను మంత్రి డిజిటల్ […]

వీసా దరఖాస్తుదారులకు అమెరికా బిగ్ షాక్..

అమెరికాలో స్థిరపడాలనే కలలతో ఉన్న భారతీయ టెక్కీలకు, విద్యార్థులకు అగ్రరాజ్యం గట్టి షాక్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వంటి కీలక వీసాల ‘ప్రీమియం ప్రాసెసింగ్’ ఫీజులను భారీగా పెంచుతూ యూఎస్‌సీఐఎస్ నిర్ణయం తీసుకుంది. మార్చి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫీజులు ఇలా ఉండబోతున్నాయి. హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు ప్రస్తుతం ఉన్న 2,805 డాలర్ల ఫీజు 2,965 డాలర్లకు పెరిగింది. అలాగే గ్రీన్ కార్డ్ దరఖాస్తుల(I-140) ఎంప్లాయిమెంట్ బేస్డ్ పిటిషన్ల ఫీజు కూడా 2,805 […]

సిగరెట్లు తాగుతున్న మహిళలు..ఇరాన్ లో వినూత్న నిరసన

ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ లో మహిళలు, యువత సహా మెజారిటీ ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.  ఈ ఉద్యమం ఇప్పుడు కొత్త ట్రెండ్ లో నడుస్తోంది. చాలా మంది యువతులు సిగరెట్లు తాగుతూ, ఇరాన్ అధినేత అయతొల్లా ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీని ద్వారా ఖమేనీ పాలనలో తామెంత విసిగిపోయామో, ఆయనపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. ఖమేనీ పాలనలో […]

ఇరాన్‌లో మరింత దిగజారిన పరిస్థితులు! 180 నగరాల్లో నిరసనలు,

ఇరాన్‌లో పరిస్థితులు రోజురోజుకు చేయిజారిపోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో దేశమంతా భగ్గుమంటోంది. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కనీసం టెలిఫోన్ కాల్స్‌ చేసుకుని మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కాల్స్‌పై కూడ నిషేధం విధించారు. ఈ ప్రదర్శనలు ఇరాన్ 31 రాష్ట్రాల్లోని 180 నగరాల్లోని 512 ప్రదేశాలకు విస్తరించాయి. ఒక వైద్యుడు పరిస్థితిపై మాట్లాడుతూ, రాజధానిలోని ఆరు ఆసుపత్రులలో కనీసం 217 మంది నిరసనకారులు మరణించారని, వారిలో ఎక్కువ మంది కాల్పుల వల్లే మరణించారని టైమ్ […]

వైట్ హౌస్ కు రావాలని కొలంబియా అధ్యక్షుడికి ఆహ్వానం

ఫిబ్రవరి ప్రారంభంలో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో సమావేశమవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించారు.అమెరికా సైనిక బలగాలు దాడి చేసి, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి జరిగినప్పటి నుంచి, పెట్రోపై కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటామని ట్రంప్ బెదిరిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆయన స్వరం మార్చారు. గుస్తావో పెట్రోను శ్వేతసౌధాన్ని సందర్శించమని ఆహ్వానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON