ఇండోనేషియా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎక్స్ఏఐ సంస్థకు చెందిన గ్రోక్ చాట్‌బాట్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. వేల మంది యూజర్లు గ్రోక్తో అసభ్య డీప్ ఫేక్ చిత్రాలు రూపొందిస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రోక్‌పై నిషేధం విధించిన తొలి దేశంగా నిలిచింది. మహిళలు, చిన్నారుల డీప్ ఫేక్ చిత్రాలు రూపొందిస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో గ్రోక్‌పై తాత్కాలిక నిషేధం విధించామని గ్రోక్తో అసభ్య చిత్రాల రూపకల్పనను మంత్రి డిజిటల్ హింసగా అభివర్ణించారు.

