loader

రూ.11,500 కోట్ల సైబర్ మోసాలు.. ఒకే కుటుంబంలో 11 మందికి మరణశిక్ష అమలు

మయన్మార్ కేంద్రంగా వేల కోట్ల రూపాయల ఆన్‌లైన్ మోసాలు, గ్యాంబ్లింగ్, హత్యలకు పాల్పడుతున్న మింగ్ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులకు మరణశిక్ష అమలు చేసినట్లు చైనా ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ మింగ్ ముఠా తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయులను కిరాతకంగా చంపేసింది. 2015 నుంచి మింగ్ గ్యాంగ్ గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ ఫ్రాడ్ 11,500 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. మయన్మార్‌లోని కోకాంగ్ ప్రాంతంలో ఈ కుటుంబం […]

విమానం కుప్పకూలి 15 మంది మృతి..!

కొలంబియా దేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 15 మంది మరణించారు. ఈ ఘటన కొలంబియా ఈశాన్య ప్రాంతమైన నోర్తే డి సాంటాండర్ ప్రావిన్స్‌లో జరిగింది. చిన్న ప్రయాణికుల విమానం గ్రామీణ..కొండ ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.సటేనా అనే ప్రభుత్వ విమాన సంస్థకు చెందిన ఈ విమానం, కుకుటా నగరం నుంచి ఓకానా అనే పట్టణానికి వెళ్తోంది.

నాసా నుంచి ‘అథీనా’- మోస్ట్ పవర్​ఫుల్ సూపర్​కంప్యూటర్

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా “అథీనా” అనే కొత్త సూపర్ కంప్యూటర్‌ను ప్రవేశపెట్టింది. ఇది కొత్త తరం మిషన్లు, పరిశోధనా ప్రాజెక్టుల కోసం రూపొందించిన అధునాతన వ్యవస్థ. ఇంకా క్లియర్​గా చెప్పాలంటే అథీనా అనేది ఒక పెటాస్కేల్ సూపర్ కంప్యూటర్. నాసా ఇప్పటివరకు రూపొందించిన తన అత్యంత శక్తివంతమైన సూపర్​కంప్యూటర్ ఇదేనని చెబుతోంది. ఇది నాసా హై-ఎండ్ కంప్యూటింగ్ కేపబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగం. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు స్పేస్, ఏరోనాటిక్స్ అండ్ సైన్స్‌లోని కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడంలో […]

కొత్త శిఖరాలకు ఐరోపా, భారత్ సహకారం: ట్రేడ్ డీల్​​పై ఈయూ కౌన్సిల్ చీఫ్

భారత్- ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం చరిత్రాత్మక ముందడుగు అని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదిరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చొరవ చూపారని అన్నారు. ఐరోపా, భారత సహకారం కొత్త శిఖరాలకు చేరుతోందని పేర్కొన్నారు. భారత్‌ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.  ఐరోపా, భారత బంధం ఈనాటిది కాదని, తమ పూర్వీకులు […]

కదులుతోన్న కారులోంచి కిందపడిన చిన్నారి.. తల్లి అరెస్ట్

కాలిఫోర్నియాలోని ఫులెర్టోన్‌లో ఎస్‌యూవీ కారు ఎడమ వైపు మలుపు తిరుగుతున్న సమయంలో కారు ప్యాసింజర్ డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. ఒక్కసారిగా కారులోంచి 19 నెలల పిల్లాడు రోడ్డుపై పడిపోయాడు. వెనకే వస్తోన్న కారు డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో ప్రమాదం తప్పింది. వెంటనే డ్రైవింగ్ చేస్తోన్న చిన్నారి తల్లి కారులోంచి కిందకు దిగి చిన్నారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. కారు వివరాలతో సదరు మహిళను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను- 25 మంది మృతి- చీకట్లో ప్రజలు

అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను వణికించిన భీకర మంచు తుపాను ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలపై పంజా విసురుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 7.5 లక్షలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వివిధ కారణాల 25 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క నూయార్క్ నగరంలోనే 8 మంది మరణించినట్లు తెలిపారు.ఆర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు 2,100 కిలోమీటర్ల విస్తీరణంలో ఒక అడుగుకు మించి మంచు పేరుకుపోయింది. న్యూయార్క్‌, పెన్సిల్వేనియా సహా పలు […]

మాకు ఇది గోల్డెన్ ఛాన్స్!- వరల్డ్​కప్​ ఎంపిక​​పై స్కాట్లాండ్ రియాక్షన్

బంగ్లా స్థానాన్ని తమ జట్టుతో రిప్లేస్​ చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించగానే స్కాట్లాండ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. తమ జట్టు స్టార్ ఆటగాళ్లు ప్రాక్టీస్​ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. దీనికి ‘ఎల్లప్పుడూ సిద్దమే’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనిపై స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్‌బ్లేడ్ (Trudy Lindblade) శనివారం మాట్లాడారు. తమ జట్టును వరల్డ్​కప్​ టోర్నీకి ఆహ్వానించినందుకు ఐసీసీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

అమెరికాను వణికిస్తోన్న మంచు తుపాను.. 10 వేల విమాన సర్వీసులు రద్దు..

మంచు తుపాను కారణంగా అమెరికాలోని 18 రాష్ట్రాలు గజ గజ వణికిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వింటర్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. 10 వేలకు పైగా విమాన సర్వీసులను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు. ఫెర్న్‌గా పేర్కొంటున్న ఈ తుఫాన్‌కు ఆర్కిటిక్‌ బ్లాస్ట్‌ వల్ల ఉత్తర ధ్రువం నుంచి వీస్తున్న అతి శీతల గాలులే కారణమని వాతావరణ శాఖ తెలిపింది.

పెంగ్విన్​తో కలిసి గ్రీన్​లాండ్​ వెళ్తున్న ట్రంప్​- AI చిత్రాన్ని పోస్ట్ చేసిన వైట్​హౌస్​

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో ట్రంప్ ఏమాత్రం తగ్గట్లేదు. అమెరికాలో గ్రీన్‌లాండ్ భాగమైపోయిందంటూ ఇటీవలే ఏఐ ఫొటోలను విడుదల చేసిన ట్రంప్, తాజాగా మరో AI చిత్రంతో సోషల్ మీడియాలో హల్ చేశారు. శనివారం వైట్‌హౌస్ ఒక  ఏఐ జనరేటెడ్ ఫొటోను షేర్ చేసింది. యూఎస్ ప్రెసిడెంట్ ఒక పెంగ్విన్‌తో కలిసి గ్రీన్‌లాండ్ వైపు నడుస్తున్నట్లు ఉన్న ఆ చిత్రానికి ‘Embrace the penguin’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే గ్రీన్‌లాండ్ విషయంలో యూరప్​ అసహనంతో ఉండగా, […]

ఆఫ్ఘనిస్తాన్‌లో మంచు తుఫాన్, భారీ వర్షాలు.. 61 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌ను ప్రకృతి వణికిస్తోంది. ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు.మృతుల్లో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఏఎన్డీఎమ్ఏ) శనివారం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON