loader

భారత్‌క శుభవార్త చెప్పిన ట్రంప్‌- టారిఫ్‌లను 25% నుంచి 18%కు తగ్గిస్తున్నట్లు వెల్లడి!

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ శుభవార్త చెప్పారు. భారత్​పై విధించిన సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకారం తెలిపాయని అన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడిన తరువాత ఆయన మేరకు ట్రూత్ సోషల్​లో పోస్టు పెట్టారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని కొనియాడిన ట్రంప్​, రష్యా నుంచి భారత్ చమురు కొనడం ఆపేస్తుందని అన్నారు. అంతేకాదు అమెరికా, వెనెజువెలా నుంచి చమురు కొనేందుకు భారత్ […]

షేక్ హసీనాకు 10 ఏళ్ల జైలు శిక్ష-బంగ్లా కోర్టు సంచలన తీర్పు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అవినీతి కేసుల్లో ఆమెకు ఏకంగా 10 సంవత్సరాల జైలు శిక్ష  విధిస్తూ ఢాకాలోని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. రాజధానిలోని పూర్బాచల్ న్యూటౌన్ ప్రాజెక్టులో ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని హసీనాపై అభియోగాలు ఉన్నాయి. రెండు వేర్వేరు కేసుల్లో ఆమెకు చెరో ఐదేళ్ల చొప్పున మెుత్తం పదేళ్ల శిక్ష ఖరారు చేశారు. ఈ కేసుల్లో హసీనా కుటుంబ సభ్యులను కుడా దోషులుగా […]

బ‌లోచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీలో మ‌హిళా సూసైడ్ బాంబ‌ర్లు.. ఫోటోలు రిలీజ్ చేసిన మిలిటెంట్ సంస్థ

బ‌లోచిస్తాన్ తిరుగుబాటు ద‌ళాలు, పాకిస్థాన్ భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంటున్న విష‌యం తెలిసిందే.  నిషేధిత బ‌లోచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ తాజాగా మ‌హిళా ఫిదాయిన్‌ల ఫోటోల‌ను రిలీజ్ చేసింది. త‌మ ద‌ళానికి చెందిన ఇద్ద‌రు మ‌హిళా సూసైబ్ బాంబ‌ర్లు భారీ దాడుల్లో పాల్గొన్న‌ట్లు బీఎల్ఏ పేర్కొన్న‌ది. ఆ ఇద్ద‌రిలో ఒక‌రి పేరు హ‌వా బ‌లోచ్‌.  మ‌రో ఫైట‌ర్‌ను అసిఫా మెంగాల్‌గా గుర్తించారు.  ఇటీవ‌ల నుషిక్‌లోని ఐఎస్ఐ క్యాంపుపై జ‌రిగిన సూసైడ్ దాడిలో ఆమె పాల్గొన్న‌ట్లు బ‌లోచిస్తాన్ […]

పాకిస్థాన్‌లో అంతర్గత యుద్ధం? 40 గంటల్లోనే 145 మంది బలి..

పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్ గత 40 గంటలుగా భీకర పోరాటంతో అట్టుడుకుతోంది. వేర్పాటువాద గ్రూపులు సృష్టించిన విధ్వంసం, దానికి ప్రతిగా భద్రతా దళాలు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో మొత్తం 145 మంది తీవ్రవాదులు హతమయ్యారు. “ఉగ్రవాదులపై మా దళాలు పైచేయి సాధించాయి. కానీ ఈ క్రమంలో అమాయక పౌరులను, సైనికులను కోల్పోవడం బాధాకరం” అని బలోచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ పేర్కొన్నారు. ప్రావిన్స్‌లోని వివిధ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు జరగడంతో సైన్యం తక్షణమే రంగంలోకి దిగి ఎదురుదాడి […]

ఉక్రెయిన్ బస్సుపై రష్యా దాడి: 15 మంది మృతి

ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో దాడులకు తెగపడింది. నిప్రో నగరంలో బస్సుపై డ్రోన్ తో దాడి చేయడంతో 15 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడినట్టు సమాచారం. ఉక్రెయిన్ లోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తికి సంస్థకు చెందిన బస్సు అని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.షిఫ్ట్ ముగిసిన అనంతరం కార్మికులు బస్సులో వెళ్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది.

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి

గాజాలో శాంతి స్థాపనకు ఒకపక్క ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మళ్లీ గాజా సిటీపై ఇజ్రాయెల్ సైనిక దళాలు శనివారం ఉదయం విరుచుకుపడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా నగరం లోని ఉత్తర ప్రాంతంతోపాటు, దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం కూడా దాడులకు బలైంది. గాజా సిటీ లోని ఒక అపార్ట్‌మెంట్‌పైన, అలాగే ఖాన్ యూనిస్‌లో నిర్వాసితుల శిబిరాలపై జరిగిన దాడిలో మొత్తం 12 మంది మృతి చెందారు.

ఓడరేవు నగరంలో భారీ పేలుళ్లు..భవనాలు,దుకాణాలు ధ్వంసం..అనేక మంది దుర్మరణం..!

ఇరాన్ దక్షిణ ఓడరేవు నగరం బందర్ అబ్బాస్‌ను శనివారం భారీ పేలుడు కుదిపేసింది. బహుళ అంతస్తుల భవనంలో పేలుడు సంభవించిందని ఇరాన్ రాష్ట్ర మీడియా పేర్కొంది. అయితే పేలుడుకు కారణం ప్రస్తుతానికి తెలియరాలేదు. ఈ ఘటనలో అనేక మంది మరణించినట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన, పేలుడు గురించి ఊహాగానాలు, ఆందోళనలకు ఆజ్యం పోసింది.

అమెరికా సెక్స్ కుంభకోణంలో మమ్దానీ తల్లి పేరు..మీరా నాయర్‌కు సంబంధం ఏమిటి?

ప్రపంచాన్ని కుదిపేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో  భారతీయ సినీ దిగ్గజం మీరా నాయర్ పేరు వినిపించడం సంచలనం సృష్టిస్తోంది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన రహస్య పత్రాల్లో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి, ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ పేరు కూడా వినిపిస్తుండగా.. 2009లో మీరా నాయర్ దర్శకత్వం వహించిన అమేలియా సినిమా విడుదలైన సమయంలో.. ఎప్‌స్టీన్ ప్రధాన అనుచరురాలు, లైంగిక నేరాల్లో దోషిగా తేలిన ఘిస్లేన్ మాక్స్‌వెల్ నివాసంలో ఒక పార్టీ […]

మరో 30వేల పేజీల పత్రాలు, 2వేల వీడియోలు, లక్షకు పైగా ఫొటోలు విడుదల

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణానికి సంబంధించి మరో 30 వేల పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. వాటితో పాటు 2వేలకు పైగా వీడియోలు, సుమారు 1.80 లక్షల ఫొటోలను కూడా విడుదల చేసింది. ఈ విడుదల గతేడాది కాంగ్రెస్ ఆమోదించిన పారదర్శకత ఆదేశాల మేరకే ఈ ఫైల్స్ విడుదల చేశాం అని, బాధిత యువతుల ఫొటోలు, పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని డిప్యూటీ అటార్నీ జనరల్‌ టాడ్‌ బ్లాంచ్‌ వెల్లడించారు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. ప్రత్యేక అతిథిగా ఏఆర్ రెహమాన్

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన ‘మెలానియా’ డాక్యుమెంటరీ ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక కెన్నడీ సెంటర్ లో ఈ డాక్యూమెంట‌రీ ప్రీమియ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. అయితే ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌కు భారతీయ సంగీత మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రెహమాన్ కు ఉన్న విశేష గుర్తింపు నేపథ్యంలో ఆయనను ఈ వేడుకకు ఆహ్వానించిన‌ట్లు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON