బలోచిస్తాన్ తిరుగుబాటు దళాలు, పాకిస్థాన్ భద్రతా బలగాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. నిషేధిత బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాజాగా మహిళా ఫిదాయిన్ల ఫోటోలను రిలీజ్ చేసింది. తమ దళానికి చెందిన ఇద్దరు మహిళా సూసైబ్ బాంబర్లు భారీ దాడుల్లో పాల్గొన్నట్లు బీఎల్ఏ పేర్కొన్నది. ఆ ఇద్దరిలో ఒకరి పేరు హవా బలోచ్. మరో ఫైటర్‌ను అసిఫా మెంగాల్గా గుర్తించారు. ఇటీవల నుషిక్‌లోని ఐఎస్ఐ క్యాంపుపై జరిగిన సూసైడ్ దాడిలో ఆమె పాల్గొన్నట్లు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది.

