ప్రపంచాన్ని కుదిపేసిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో భారతీయ సినీ దిగ్గజం మీరా నాయర్ పేరు వినిపించడం సంచలనం సృష్టిస్తోంది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన రహస్య పత్రాల్లో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి, ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ పేరు కూడా వినిపిస్తుండగా.. 2009లో మీరా నాయర్ దర్శకత్వం వహించిన అమేలియా సినిమా విడుదలైన సమయంలో.. ఎప్స్టీన్ ప్రధాన అనుచరురాలు, లైంగిక నేరాల్లో దోషిగా తేలిన ఘిస్లేన్ మాక్స్వెల్ నివాసంలో ఒక పార్టీ జరిగినట్లు ఈ పత్రాలు చెబుతున్నాయి.

