loader

శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, మరో 3 మంది ప్రయాణికులతో కూడిన ఆక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రయాణానికి బయలుదేరింది.ఈ మిషన్ సరిగ్గా మధ్యాహ్నం 12.01 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. SpaceX కొత్త డ్రాగన్ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని NASA కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి బయల్దేరింది. ఈ అంతరిక్ష నౌకను కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు.

ఫ్రాన్స్‌ను పిచ్చెక్కిస్తున్న సిరంజి దాడులు..

సాధారణ జనాలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సిరంజీలతో దాడికి పాల్పడుతున్న ఘటనలు ఫ్రాన్స్‌ దేశంలో వెలుగుచూశాయి. ‘ఫెటెస్ డి లా మ్యూజిక్ ఫెస్టివల్’ లో పాల్గొన్న ప్రేక్షకులపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ‘సిరంజులతో దాడులకు పాల్పడ్డారు. నిందితుల చేతుల్లో సూది పోట్లకు గురైన కొంత మంది అనారోగ్యబారిన పడ్డారు. గుండెలు, చేతులు, కాళ్లు, పిరుదులపై సిరంజితో గుచ్చినట్లు బాధితులు తెలిపారు. వాటి కారణంగా తమలో తలతిరగడం, వాంతులు, అసౌకర్యం వంటి లక్షణాలను కనిపించాయని తెలిపారు.

ఇరాన్‌పై దాడి వీడియోలు రిలీజ్ చేసిన పెంటగాన్

ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ పేరుతో అమెరికా సైన్యం ఇరాన్‌లోని మూడు కీలక న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్ , నటాంజ్ , ఇస్ఫహాన్ B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌లు బాంబుల వర్షం కురిపించాయి. పెంటగాన్ జూన్ 24, 2025న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అధికారిక వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది, ఇందులో B-2 బాంబర్‌లు వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి బయలుదేరడం, దాడి అనంతరం తిరిగి వచ్చే దృశ్యాలు ఉన్నాయి.

శత్రువుల మాటలపై మాకు నమ్మకం లేదు..టెహ్రాన్‌

12 రోజులుగా ఆయుధాలతో యుద్ధం చేసుకున్న ఇజ్రాయెల్-ఇరాన్‌..ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణను ఇరాన్‌ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. తమపై క్షిపణులతో దాడులకు దిగిందని టెల్‌అవీవ్‌ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్‌పై తాము ఎలాంటి దాడులూ చేయలేదని ఇరాన్‌ సైనికాధికారులు వెల్లడించారు. శత్రువుల మాటలపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తమ చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని వెల్లడించారు.

కాల్పుల విరమణ చేయాలంటూ ట్రంప్ బతిమాలారు..ఇరాన్

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గత కొంత కాలంగా యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తూ.. అమెరికా కూడా ఆదివారం రోజు ఇరాన్‌పై దాడి చేసింది. దీంతో ఇరాన్ సైతం అమెరికా స్థావరాలపై ప్రతి దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఖతార్‌లోని అనేక స్థావరాలపై విజయవంతంగా దాడి చేసింది. ఈక్రమంలోనే ఇజ్రాయెల్‌తో ట్రంప్ బలవంతంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరింపజేశారని ఇరాన్ వివరిస్తోంది. ఈ దాడి అనంతరమే ఒప్పందం కోసం ట్రంప్ తమను ప్రాధేయ పడ్డారని పేర్కొంటోంది.

ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం..: నెతన్యాహు

ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరదించుతూ.. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించిందని ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం రోజు కీలక ప్రకటన చేశారు. అమెరికా ఇరాన్‌లోని అణు స్థావరాలపై దాడి చేయడంతో ప్రారంభమైన 12 రోజుల తీవ్రమైన వైమానిక దాడులు, ప్రతిదాడుల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడటం అంతర్జాతీయ సమాజంలో ఒక పెద్ద పరిణామంగా భావిస్తున్నారు

యుద్ధం సమాప్తి కాని శాంతి- భవిష్యత్తుపై ఆందోళన

11 రోజుల అనంతరం కాల్పుల విరమణకు అంగీకారంట్రంప్ ప్రకటనతో శాంతికి తొలి అడుగుఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం సమాప్తి కాని శాంతి – భవిష్యత్తుపై ఆందోళన మధ్య గత 11 రోజులుగా కొనసాగిన యుద్ధం ముగిసింది. ఈ తెల్లవారుజాము నుంచి కాల్పుల విరమణకు ఇరాన్‌ మరియు ఇజ్రాయెల్‌ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ప్రకటించారు. ఇరాన్‌ ఈ ప్రకటనను ధృవీకరించింది. ఈ మేరకు ఇరాన్‌ అధికారిక మీడియా ఛానల్‌ ఒక గ్రాఫిక్స్‌ కథనంతో వార్తను ప్రసారం చేసింది. .

ఇండియాలో ఎక్కువ రోజులున్నారని H-1B వీసాలు రద్దు

భారతదేశంలో ఎక్కువ కాలం ఉన్నారని చెప్పి H-1B వీసాలు రద్దు చేసేస్తున్నారు. ఇటీవల ముగ్గురు భారతీయ H-1B వీసా హోల్డర్లు అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అబూ ధాబీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఇక్కడ యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వీరి వీసా నిబంధనలు తనిఖీలు చేసి.. ఆపేశారు. H-1B వీసా హోల్డర్లు యుఎస్ వెలుపల 60 రోజులకు మించి ఉండకూడదనే నిబంధనను ఉల్లంఘించారని చెప్పారు.

మేక్‌ ఇరాన్‌ గ్రేట్‌ ఎగైన్‌.. దాడుల తర్వాత రూట్ మార్చిన డొనాల్డ్ ట్రంప్

ట్రంప్‌ నుంచి మరో ఆసక్తికర ప్రకటన వచ్చింది. అదే.. పాలన మార్పు గురించి. ప్రస్తుతం అయతుల్లా అలీ ఖమేనీ కనుసన్నల్లో ఇరాన్‌ పాలన సాగుతుంది. ‘పాలన మార్పు’ అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాదు, కానీ ప్రస్తుత ఇరాన్ పాలన ఇరాన్‌ను మళ్లీ గొప్పగా చేయలేకపోతే, పాలన మార్పు ఎందుకు జరగదు?” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో MIGA (మేక్‌ ఇరాన్‌ గ్రేట్‌ ఎగైన్‌) నినాదాన్ని ఉద్ఘాటిస్తూ పేర్కొన్నారు

ఆకాశాన్నంటనున్న ముడి చమురు, గ్యాస్ ధరలు!

అమెరికా దాడి తర్వాత ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. క్రూడ్ ధరలు భారీగా పెరగొచ్చు. దీంతో పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకొచ్చు హార్ముజ్‌ జలసంధి ద్వారా ప్రపంచానికి 20 శాతం ముడి చమురు సరఫరా అవుతుంది. క్రూడాయిల్‌, గ్యాస్‌ దిగుమతులపై ఆధారపడ్డ భారత్‌ లాంటి దేశాలపై ఇరాన్‌ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON