తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ కు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
మధ్యాహ్నం చెన్నెకు చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం సమయంలో టీవీకే చీఫ్ విజయ్ ఆయనను లోక్ భవన్ లో కలవనున్నారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు జాబితాను సమర్పించాలని విజయ్ కు గవర్నర్ సూచించారు.