గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమ ఏపీకి రావడం ఆనందదాయకమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీసిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమలకు లోకేశ్ శంకుస్థాపన చేశారు. “ఏపీకి అనేక దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు త్వరగా అందుబాటులోకి తెస్తున్నాం. అవకాశాలను అందిపుచ్చుకునే సమర్థత ఏపీలో పుష్కలంగా ఉంది. సమర్థ నాయకత్వంలో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి” అని లోకేశ్ అన్నారు.