ప్రముఖ ఐటీ సర్వీస్ సంస్థ కాగ్నిజెంట్‌లో లేఆఫ్స్ జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 12,000 నుండి 15,000 మంది ఉద్యోగులపై దీని ప్రభావం ఉండనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ వలన ఎక్కువగా ఇండియాలో పనిచేసే ఉద్యోగులే ప్రభావితం కావచ్చని మనీ కంట్రోల్ రిపోర్ట్ కథనంలో పేర్కొంది.ప్రాజెక్ట్ లీప్’ కింద ఉద్యోగ విరమణ పరిహారం కోసం 230 మిలియన్ డాలర్ల నుండి 320 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది.కాగ్నిజెంట్‌లో 3,57,000 మందికి పైగా ఉద్యోగులు ఉండగా, 2,50,000 మందికి పైగా ఇండియాలోనే ఉన్నారు.