శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులకు డోలీ మోత కష్టాలు తప్పడంలేదు. లింగాపురం గిరిజనగూడలో పురిటి నొప్పులతో బాధ పడుతున్న సునీతను గిరిజనులు 2 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోడ్డు మార్గం లేకపోవడంతో డోలీలో తీసుకెళ్లి అనంతరం ఆటోలో పాతపట్నం ఆసుపత్రికి తరలించారు. వాళ్లతో పాటు ఆశ వర్కర్ కూడా ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన గిరిజనుల బతుకులు మారడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.