తాము కష్టపడి థామస్ కప్ లో పతకం తీసుకొచ్చినా.. కనీస గుర్తింపు లేకపోవడంపై స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఆవేదన వ్యక్తంచేశాడు. కేవలం ఐపీఎల్, ఎన్నికల పైనే అభిమానులు ఫోకస్ చేస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే, భవిష్యత్తులో తన పిల్లలను బ్యాడ్మింటన్ ఆడించనని సాత్విక్ వ్యాఖ్యానించాడు. థామస్ కప్ లో కాంస్య పతకం సాధించిన భారత జట్టుకు కనీసం తమకు స్వాగతం పలికేందుకు అభిమానులు కూడా రాకపోవడం బాధించిందని తెలిపాడు. భారత్ వంటి దేశంలో బ్యాడ్మింటన్ ను ప్రొఫెషన్ల్ గేమ్ చూడటం లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నాడు.