loader

టీమిండియా భారీ స్కోరు.. షెఫాలీ, దీప్తి ఫిఫ్టీలు

సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న మ‌హిళా వన్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ కు దిగిన భార‌త్.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 298 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ సూప‌ర్బ్ ఫిఫ్టీ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. మ‌హిళా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్లో ఒక జ‌ట్టు ఛేజ్ చేసిన అత్య‌ధిక స్కోరు కేవ‌లం 167 ప‌రుగులే […]

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్‌ స్మృతి మంధాన సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్‌ వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. నేడు(ఆదివారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో మంధాన ఈ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలి రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. 2025 ఎడిషన్‌లో స్మృతి 418 […]

సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్.. ఆలస్యంగా టాస్..

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం కారణంగా టాస్ వాయిదా పడింది. ప్రస్తుతం వాన ఆగినా చిత్తడి అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్‌ను అంపైర్లు వాయిదా వేశారు. గ్రౌండ్‌లో పలు ప్రాంతాలు చిత్తడిగా మారాయి. గత రెండు రోజులుగా నవీ ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి.  వర్షం కురవడంతో టాస్ ఆలస్యం కానుంది. మ్యాచ్ కూడా ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం మళ్లీ రావడంతో టాస్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం […]

ఫైనల్‌పై వాన గండం : రిజర్వ్ డే కూడా

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 తుది దశకు చేరుకుంది. నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్‌లో టీమిండియా సౌతాఫ్రికాతో తలపడనుంది. తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్ చేరగా, రెండో సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం లేకున్నా, చిరుజల్లులైనా మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.  30-60 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని సమాచారం. […]

చెస్ దిగ్గజానికి అరుదైన గౌరవం.. వరల్డ్ కప్ చెస్ ఇకపై ఆనంద్ కప్..!

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు అతిపెద్ద గౌరవం లభించింది. మనదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్ అయిన ఆనంద్‌ పేరుతో ట్రోఫీని నిర్వహించాలని ఫిడే నిర్ణయించింది. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చెస్ కప్ టోర్నీకి ఆనంద్ పేరు పెట్టింది. చదరంగంలో ఆయన కృషి, సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవం కల్పిస్తున్నట్టు భారత చెస్ సమాఖ్య అధ్యక్షుడు నితిన్ నారంగ్ వెల్లడించారు. పురాతన ఆటలో ఒకటైన చదరంగం వైభవాన్ని ఈ ట్రోఫీ ప్రతిబింబిస్తుంది అని వెల్లడించారు.

జెమీమా రోడ్రిగ్స్: క్రికెట్ ప్రపంచంలో అసాధారణ స్టార్‌

జెమీమా రోడ్రిగ్స్ భారత మహిళా క్రికెట్‌లో యంగ్ స్టార్‌ ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో అజేయ సెంచరీతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. పన్నెండున్నర సంవత్సరాల వయస్సులోనే ఆమె అండర్-19 క్రికెట్ సీజన్‌లో అరంగేట్రం చేసింది. దేశీయ 50 ఓవర్ల మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా, ఆమెకు 2017-18 సీజన్‌కు గాను బీసీసీఐ నుండి బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్స్ క్రికెటర్ పురస్కారం లభించింది.

జెమీమా చిరస్మరణీయ శతకం.. మూడోసారి ఫైనల్లో టీమిండియా

ఉత్కంఠ రేపిన సెమీ ఫైనల్లో భారత జట్టు జయభేరి మోగించింది.. ఎనిమిదిసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాకు చెక్ పెడుతూ రికార్డు లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే ఊదిపడేసింది. భారీ ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్‌(127 నాటౌట్) చిరస్మరణీయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89)తో సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేశారు. వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేదించింది టీమిండియా. 5 వికెట్ల తేడాతో కంగారూలను ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన ఆదివారం దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడనుంది.

ప్రపంచ క్రికెట్‌ను నియత్రించేది భారత్.. గ్రెగ్ చాపెల్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను భారతదేశం నియంత్రిస్తుందని భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నారు. ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి భారత జట్టు తన అధికారాన్ని ఉపయోగిస్తుందని చెప్పిన మాజీ ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌ను చాపెల్ కూడా సమర్ధించడం గమనార్హం. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాపెల్ మాట్లాడుతూ, గంగూలీ క్రికెట్ ఆడటానికి శ్రీలంకకు వెళ్లడానికి వీలుగా అతనిపై సస్పెన్షన్‌ను తగ్గించాలని మాజీ బీసీసీఐ, ఐసీసీ చీఫ్ జగ్మోహన్ దాల్మియా అభ్యర్థించారని అన్నారు.

ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల 182 రోజుల వయసులో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. దాంతో లేటు వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అయితే ఇన్నేళ్ల తన వన్డే క్రికెట్‌ కేరీర్ లో మొదటి స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. గాడ్ ఆఫ్ క్రికెట్ గా చెప్పుకునే సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి ప్రపంచ రికార్డు సృష్టించాడు హిట్ మ్యాన్.

వెటరన్ పేసర్‌కు అత్యున్నత గౌరవం..‘నైట్‌హుడ్‌’ స్వీకరించిన అండర్సన్

ఇంగ్లండ్ వెట‌ర‌న్ పేస‌ర్ జేమ్స్ అండ‌ర్సన్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ జట్టుకు 21 ఏళ్లు విశేష సేవ‌లందించిందుకు ‘నైట్‌హుడ్’ బిరుదును స్వీక‌రించాడీ లెజెండ్. బ్రిటన్‌ రాణి అన్నె చేతుల మీదుగా మంగళవారం అండరన్సన్ నైట్ హుడ్‌ మెడల్‌ను అందుకున్నాడు. ఇక నుంచి అండర్సన్ పేరు ముందు సర్ అనే పదం చేరనుంది. ఇప్పటివ‌ర‌కు 12 మంది ఇంగ్లండ్ మాజీలు మాత్రమే ఈ అవార్డు అందుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON