loader

ఐపీఎల్ ఫ్రాంచైజీకి గుడ్ బై.. మెంటర్‌గా వైదొలిగిన యార్కర్ కింగ్..!

ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ముందు కొందరు ఆటగాళ్లు జట్టు మారేందుకు సిద్దమవుతుండగా.. కొందరేమో మేము మీతో కొనసాగలేం అంటూ ఫ్రాంచైజీలను వీడుతున్నారు టీమిండియా పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ ఐపీఎల్ జట్టుకు బై బై చెప్పేశాడు. ఏడాది క్రితం లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా నియమితుడైన జహీర్ గురువారం తన బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా, కోచ్ జస్టిన్ లాంగర్‌తో పొసగకే అతడు రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం.

స్మృతి మంధాన డబుల్ హిస్టరీ.. అత్యంత ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ

సెప్టెంబర్ 17న మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన ప్రదర్శనతో  కేవలం 77 బంతుల్లోనే సెంచరీ సాధించి, భారత మహిళా క్రికెట్‌లో రెండవ ఫాస్టెస్ట్ వన్డే సెంచరీని తన పేరున లిఖించుకుంది. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో, స్మృతి మంధాన ఒక క్యాలెండర్ సంవత్సరంలో భారత మహిళా బ్యాటర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డును అధిగమించింది. ఈ సెంచరీతో ఆమె ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన […]

ఉగ్రవాదం ఆగాలి.. క్రీడలు కొనసాగాలి – గంగూలీ

భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం పూర్తిగా అంతం కావాలని ఆయన నొక్కి చెప్పారు, కానీ దాని కారణంగా క్రీడలు ఆగిపోకూడదని అన్నారు. “ఉగ్రవాదం కచ్చితంగా ఆగాలి. అది చాలా ముఖ్యం. కానీ క్రీడలు అస్సలు ఆగకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం భారత్, పాకిస్తాన్‌లోనే కాకుండా ప్రపంచమంతటా ఉగ్రవాదం అంతరించిపోవాలని ఆయన అన్నారు.

వరుసగా రెండో ‘గ్రాండ్ స్విస్’ టైటిల్.. చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్

ప్రపంచ చదరంగాన్ని భారత యువ గ్రాండ్‌మాస్టర్లు శాసిస్తున్నారు. రమేశ్‌బాబు వైశాలి చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్విస్‌ టైటిల్‌న నిలబెట్టుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. సోమవారం జరిగిన ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ టాన్ జొంగ్యీ కు ముచ్చెమటలు పట్టించింది వైశాలి. అసమాన పోరాటంతో మ్యాచ్ డ్రా చేసుకున్న భారత చెస్ క్వీన్.. అత్యధిక పాయింట్లతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. వచ్చే ఏడాది జరుగబోయే క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించిందీ చెస్ క్వీన్.

భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్.. టార్గెట్ ఎంతంటే?

భారత్, పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ పోరు జరిగింది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. రెండు మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. పిచ్ నెమ్మదిగా ఉండడంతో స్పిన్‌కు అనుకూలించింది. దీంతో భారత్ పాక్ ను 127/9 పరుగులకే పరిమితం చేసింది. భారత్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 3/18తో మెరిశారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. బుమ్రా, పాండ్యా తలా ఒక్కో వికెట్ సాధించారు. వరుణ్ చక్రవర్తి కూడా […]

ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్

ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. హార్థిక్ పాండ్యా వేసిన  బంతికి జట్టు ఓపెనర్ సైమ్ అయూబ్(0) బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో మహ్మద్ హారిక్(3) హార్థిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 2 వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజ్‌లో సాహిబ్జాదా […]

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

ప్రపంచబాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతాకం లభించింది. 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా బంగారు పతకం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కజికిస్థాన్‌కు చెందిన నాజిమ్ కైజైబేపై 4-1 స్ల్పిట్ డెషిషన్‌తో మీనాక్షి విజయం సాధించింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతాకం సాధించిన నాజిమ్‌కి భారత బాక్సర్ మీనాక్షి గట్టి పోటీ ఇచ్చింది. తొలి రౌండ్లో ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. దీంతో తొలి రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకుంది.

BCCI కొత్త ప్రెసిడెంట్‌ రేసులో సచిన్ టెండూల్కర్?

రోజర్ బిన్నీ, బీసీసీఐ ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి తప్పించబడడంతో ప్రస్తుతం ఆ కుర్చీ ఖాళీగా ఉంది. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ప్రస్తుతం తాత్కాలిక ప్రెసిడెంట్‌గా బాధ్యతల్లో ఉన్నాడు. అయితే బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ రేసులో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. సచిన్ టెండూల్కర్, బీసీసీఐలో ఎలాంటి పొజిషన్స్ స్వీకరించడానికి సిద్ధంగా లేనట్టు సమాచారం. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.డు.

యూఏఈపై భారత్ ఘన విజయం…

ఆసియా కప్ 2025 టోర్నీని భారత జట్టు ఘనంగా ఆరంభించింది. దుబాయ్ వేదికగా ఆతిథ్య యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది భారత్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు, 13.1 ఓవర్లలో 57 పరుగులకి ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి ఛేదించింది భారత జట్టు.. వరుసగా 15 మ్యాచుల్లో టాస్ ఓడిన భారత జట్టు, ఎట్టకేలకు దాన్ని బ్రేక్ చేసింది. టాస్ […]

తొలి రౌండ్‌లోనే సింధు నిష్క్రమణ.. ప్రణయ్, లక్ష్యసేన్ ముందంజ..!

గత ఏడాది కాలంగా మేజర్ టైటిల్‌ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన లినే క్రిస్టోఫెర్సెన్‌ చేతిలో సింధు అనూహ్యంగా కంగుతిన్నది. గతంలో లినేను ఐదుసార్లు చిత్తు చేసిన భారత స్టార్ ఈసారి మాత్రం చేతులెత్తేసింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ ముందంజ వేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON