loader

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు బీఆర్ఎస్ దూరం: ఎంపీ సురేశ్ రెడ్డి

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు .. బీఆర్ఎస్ దూరంగా ఉండ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభ ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని, యూరియా కొర‌త వ‌ల్ల రైతులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, యురియా కొర‌త‌ను తీర్చాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను డిమాండ్ చేశామ‌ని, రెండు ప్ర‌భుత్వాలు రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు సురేశ్ రెడ్డి అన్నారు. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక బ్యాలెట్‌పై నోటా అందుబాటులో లేదు కాబ‌ట్టి ఎన్నిక‌కు […]

చర్లపల్లి డ్రగ్స్‌ ముఠా వెనుక కాంగ్రెస్‌ నాయకుల హస్తం

తెలంగాణ చరిత్రలో మొదటి అతి పెద్ద డ్రగ్స్‌ కేసు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో 12వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ ఒక కంపెనీలో పట్టుబడటం దారుణమని, దీని వెనుకాల కాంగ్రెస్‌ నాయకుల హస్తం ఉందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. దీనికి హోం మంత్రి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం మహారాష్ట్ర పోలీసులు చెబుతుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నట్టు ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి సౌరథ్యంలో నడుస్తున్న […]

మంత్రి లోకేశ్ పై అంబటి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కేసు నిందితులు బెయిల్‌పై విడుదలవ్వడంపై వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు వినూత్న శైలిలో స్పందించారు. ఈ విషయంపై ఆయన మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ తన X (ట్విట్టర్) ఖాతాలో సెటైర్లు వేశారు. ‘నీ లక్ష్యం నెరవేరకుండానే SIT చితికినట్లుంది. జర చూసుకో సూట్ కేసు. అప్పటి పప్పు.. ఇప్పటి సూట్ కేసు’ అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

కవితపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు..

కవిత మాజీ సీఎం KCR చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు. కవిత కూడా కొరివి దెయ్యమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కవితనే చెప్పారని తెలిపారు. తాను ఆనాడు మంత్రి పదవి కోసం BRS పార్టీలోకి రాలేదని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతర వేసిందని విమర్శించారు. కవిత కొంత దాచిపెట్టి.. కొంత మూసిపెట్టి మాట్లాడుతున్నారని జూపల్లి ఆరోపించారు.

ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో హరీష్ రావు సమావేశం

భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో శనివారం ఉదయం పార్టీ కీలక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబిపూర్ రాజు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు కాస్త ఆలస్యంగా ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. తెల్లవారుజామునే ఆయన లండన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కవిత చేసిన ఆరోపణలపై […]

ఇందిరమ్మ రాజ్యమంటే వేధింపులు, బెదిరింపులా..?: ఎంఎల్‌సి కవిత

ఇందిరమ్మ రాజ్యమంటే వేధింపులు, బెదిరింపులా..? అని ఎక్స్ వేదికగా ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూరియా కొరతపై ప్రశ్నించడమే నేరమా..? అని నిలదీశారు.యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు లక్ష్మణ్ యాదవ్ నిలదీశాడని పోలీసులు ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న దుర్మార్గమిది అంటూ ఎక్స్‌లో వీడియోను పోస్టు చేశారు.

లండన్‌లో ‘మీట్ & గ్రీట్ విత్ హరీష్ రావు’.. భారీ సంఖ్యలో పాల్గొన్న ఎన్నారైలు

లండన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రతినిధులు భేటీ అయ్యారు. వెస్ట్ లండన్‌లో మాజీ మంత్రితో శుక్రవారం ” మీట్ & గ్రీట్ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకేలోని ఎన్నారైలు, హరీష్ రావు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యనాయకులు రవి ప్రదీప్ పులుసు, సురేష్ గోపతి అధ్యక్షత వహించారు.

చేతకాని కాంగ్రెస్ పాలకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ ధ్వజం

తెలంగాణలో కాంగ్రెస్ పాలన చేతగానిదని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో బాన్స్వాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, వందలాది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేటీఆర్ అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌తో.. వసుంధర రాజే రహస్య సమావేశం

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్ మోహన్ భగవత్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ ప్రత్యేక భేటీ సుమారు 20 నిమిషాలు కొనసాగింది. జోధ్‌పూర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న బీజేపీ సీనియర్‌ నాయకురాలు వసుంధర రాజే, గురువారం రామ్‌డియోరా మందిరానికి వెళుతూ లాల్ సాగర్ ప్రాంతంలోని ఆదర్శ్ విద్యా మందిర్‌లో మోహన్‌ భగవత్‌ను కలిశారు. కొంత కాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న.  నేపథ్యంలో ఆకస్మికంగా మోహన్‌ భగవత్‌ను ప్రత్యేకంగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON